Telugu News

ఎస్సారెస్పీ 20 వరద గేట్ల ఎత్తివేత

గోదావరి నదిలోకి నీటి విడుదల

0

ఎస్సారెస్పీకీ భారీగా వరద.. 20 గేట్ల ఎత్తివేత

★★ గోదావరి నదిలోకి నీటి విడుదల

నిజామాబాద్, జులై 12(విజయంన్యూస్):

ఎగువున కురుస్తున్న వర్షాలకు భారీగా వరదలు వస్తుండటంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిండుకుండను తలపిస్తోంది. ఇప్పటికే పూర్తి స్థాయి నీటిమట్టంకు వరద నీరు చేరుకోగా ఇంకా భారీగా వరద వస్తోంది.

Allso read:- నిలకడగా గోదావరి ఉదృతి

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లోకి సుమారు 90580 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 20 గేట్లను ఎత్తి 69450 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు.. అలాగే
వరద కాల్వకు 14 వేల క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091అడుగులు 90టిఎంసి ల కాగా ప్రస్తుతం
1087.6అడుగులు 75.145 టిఎంసిల నీటి నిల్వ ఉన్నట్లు తెలిపారు. దిగువకు నీటీని విడుదల చేయడంతో గోదావరి మళ్ళి పెరిగే అవకాశం ఉంది.

Allso read:- మంత్రి పువ్వాడకు సీఎం కేసీఆర్ పోన్