Telugu News

ఎస్టీ సెల్ నగర అధ్యక్షులుగ శంకర్ నాయక్

నియామక పత్రం అందజేసిన జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు

0

ఎస్టీ సెల్ నగర అధ్యక్షులుగ శంకర్ నాయక్

== నియామక పత్రం అందజేసిన జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం నగర ఎస్టీ సెల్ అధ్యక్షులుగా శంకర్ నాయక్ నియమితులు అయ్యారు.ఆల్  ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులు మళ్ళీ ఖర్జున్ కర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాందీల  ఆల్ ఇండియా ఆదివాసీ అధ్యక్షులు శివాజీ రావు మోగేజిల ఆదేశానుసారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమర్కలు నియమించారు. సోమవారం జిల్లా కాంగ్రెస్  కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ నియామక పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కష్ట పడ్డ ప్రతి కార్యకర్తను పార్టీ దృష్టిలో పెట్టుకుంటుందని కష్ట పడే వారికి పదవులు వాటంతట అవే వస్తాయని అన్నారు.గిరిజన పక్షాన గిరిజన సమస్యలపై పోరాడి ముందు ముందు మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాక్షించారు. అనంతరం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ..

allso read- రాజకీయ కుట్రలో భాగమే రాహుల్ గాంధీ పై అనర్హత వేటు: కాంగ్రెస్ నేతలు

ఆదివాసీ బిడ్డ గా వారి సమస్యలపై ప్రభుత్వంతో పోరాడాలని, భారత్ జోడో యాత్ర, హత్ సే హత్ యాత్ర స్పూర్తితో ఆదివాసీ తండాలో కాంగ్రెస్ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, రాహుల్ గాంధీ సందేశం సిద్ధాంతం గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు చేరవేయలని సూచించారు. మోడీ, కేసీఆర్ ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరించాలని అన్నారు. అనంతరం శంకర్ నాయక్ మాట్లాడుతూ…తనపై నమ్మకముంచిన పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు జగన్ లాల్ నాయక్, సీఎల్పి లీడర్  మల్లు భట్టి విక్రమార్కకు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ కు నగర కాంగ్రెస్ అధ్యక్షుల మహమ్మద్ జావేద్ కు, మాజీ పార్లమెంటు సభ్యురాలు రేణుకచౌదరి కి సంబాని చంద్ర శేఖర్ కు  కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ నియమ నిబంధనలను పాటిస్తూ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.