Telugu News

పంచాయతీ కార్యదర్శులకు అండగా ఉంటాం: కాంగ్రెస్ 

పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు సంఘీభావం తెలిపిన కూసుమంచి మండల కాంగ్రెస్

0

*పంచాయతీ కార్యదర్శులకు అండగా ఉంటాం: కాంగ్రెస్ 

*== పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు సంఘీభావం తెలిపిన కూసుమంచి మండల కాంగ్రెస్*

కూసుమంచి, మే 2(విజయం న్యూస్)

పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని, అందర్ని జీపీఎస్ లు గా ప్రకటించాలని, విధులలో మరణించిన పంచాయతీ కార్యదర్శుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం పిలుపు మేరకు కూసుమంచి మండల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెకు కూసుమంచి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం సంఘీభావం తెలిపారు.

ఇది కూడా చదవండి:- కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డం త‌థ్యం: జావిద్

దీక్షా శిబిరంలో కూర్చోన్నవారికి పూలమాలలు వేసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి. హాఫీజుద్దిన్ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని మాత్రమే అడుగుతున్నారని,మూడు సంవత్సరాలకే రెగ్యులర్ చేయాల్సింది, ఒక సంవత్సరం పెంచిన వాళ్ళకు రెగ్యులర్ చేయలేకపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. పంచాయతీ కార్యదర్శులతో వెట్టిచాకిరి చేయించుకోవడమే తప్ప వాళ్ళకు ఇవ్వాల్సిన సౌకర్యాలను అమలు చేయలేకపోయారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన కోరికలను తీర్చాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి:,- ఇది దున్న‌పోతు ప్ర‌భుత్వం : భట్టి విక్రమార్క

లేదంటే పంచాయతీ కార్యదర్శులతో కలిసి ప్రభుత్వం మెడలు వంచే వరకు పోరాటం చేస్తామని, వారి పోరాటానికి అండగా ఉంటామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ బెల్లంకొండ శరత్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దాసరి వెంకన్న, మాజీ సోసైటీ చైర్మన్ దాసోజు వెంకన్న,జుజ్జులరావుపేట ఎంపీటీసీ బానోతు సుజాత సత్యం, సీనియర్ జర్నలిస్ట్ పెండ్ర అంజయ్య, పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు అంబాల అంజయ్య, ఉపాధ్యక్షుడు టి.కోటయ్య, వి.సృజన, ప్రధాన కార్యదర్శి కె.కిషోర్, కోశాధికారి జి. అనిల్ కుమార్, సంయుక్త కార్యదర్శి ఏ. రంజిత్ కుమార్, రమేష్, నరేష్, తదితరులు హాజరైయ్యారు.