Telugu News

విజయం పత్రికను ప్రారంభించిన సీఎల్పీ నేత భట్టి

%% జర్నలిస్టులు ప్రజలకు వారధిగా పనిచేయాలి

0

విజయం పత్రికను ప్రారంభించిన సీఎల్పీ నేత భట్టి
 జర్నలిస్టులు ప్రజలకు వారధిగా పనిచేయాలి
” విజయం పత్రిక, క్యాలెండర్ ను అవిష్కరించిన సీఎల్పీనేత భట్టి విక్రమార్క
హాజరైన మాజీ ఎమ్మెల్సీ పోట్ల, జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల, టౌన్ అధ్యక్షుడు జావిద్
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్);-
జర్నలిస్టులందరు ప్రజలకు వారధిగా పనిచేయాలని సీఎల్పీనేత భట్టి విక్రమార్క కోరారు. శనివారం సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఖమ్మంలోని సీఎల్పీ క్యాంఫ్ కార్యాలయంలోని ప్రజాభవన్ లో ‘విజయం’ తెలుగు దినపత్రిక, క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పత్రిక చైర్మన్ అండ్ ఎడిటర్ పెండ్ర అంజయ్యను అభినందించారు.

కరోనా విపత్కర సమయంలో పత్రిక వ్యవస్థ ఇబ్బందులు పడుతున్న సమయంలో దినపత్రికను స్థాపించడం సాధాహరణ విషయం కాదని, అందరు ఐక్యంగా పనిచేస్తే ఎంతటి కష్టానైన్న అదిగమించోచ్చని అన్నారు. జర్నలిస్టులందరు ప్రజలకు, ప్రభుత్వనికి వారధిగా పనిచేయడంలో ముందుండాలి, నిజమైన, నిఖార్సైన జర్నలిజం విలువలతో కూడిన కథనాలను ప్రజలకు అందించాలని కోరారు.. ప్రజల పక్షాన ఉంటూ సమస్యలను ఎప్పటికప్పుడు వెలికితీస్తూన్న ప్రముఖ పత్రికల్లో ఒకటిగా ‘విజయం పత్రిక’ తనదైన శైలిలో గుర్తింపు సాధించారని అన్నారు. ఎనిమిది నెలల కాలంలో ఈపత్రిక, ప్రజలలో, అధికారులలో విశేష స్పందన తో దూసుకెళ్తుందని తెలిపారు.

also read:-కరోనా మహమ్మారిపట్ల అప్రమత్తంగా ఉండాలి : మంత్రి పువ్వాడ ★

విజయం పత్రిక అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థాయికి చేరుకోవాలని, జర్నలిస్టులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని హామినిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గప్రసాద్, ఖమ్మం నగర కమిటీ అధ్యక్షుడు ఎండీ.జావిద్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మొక్క శేఖర్ గౌడ్, విజయం పత్రిక నెట్ వర్క్ ఇన్ చార్జ్ ఉల్లోజు వేణు, డిస్కె ఇన్ చార్జ్ నాగరాజు, విలేకర్లు క్రిష్ణారావు, శివనాగిరెడ్డి, విజయ్, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.