గ్రామ పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది: మంత్రి
గార్లపాడు గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవంలో మంత్రి పువ్వాడ
గ్రామ పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది: మంత్రి
== గార్లపాడు గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవంలో మంత్రి పువ్వాడ
బోనకల్/ ఖమ్మం,మార్చి,20(విజయంన్యూస్):
గ్రామ పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు. సోమవారం మధిర నియోజకవర్గం బోనకల్ మండలం గార్లపాడు గ్రామంలో రూ.16 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనంను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక అనేక గ్రామాలలో మౌళిక సదుపాయాలుతో పాటు అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. పంచాయతీలలో సీసీ రోడ్లు, డ్రైనేజిలు, త్రాగు నీరు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తూ పలు రంగాలలో ముందుకు వెళ్తుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తెలంగాణా రాష్ట్రం పచ్చదనంతో పాడి పంటలతో సుబిక్షంగా ఉండాలనేదే ప్రభుత్వ ఆకాంక్ష అని మంత్రి అన్నారు. ఖమ్మం జిల్లా గతంలో ఎన్నడూ లేని విదంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా నిధులు విడుదల చేస్తున్నదని, ఇండ్లు లేని నిరుపేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లను అందిస్తున్నమని, సొంత స్థలం ఉన్న వారికి ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షలు అందించడం జరుగుతుందని, గ్రామాల్లో ప్రతి గుంటకూ సాగునీరు, ప్రతి ఇంటికీ తాగునీరు, నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడమే ముఖ్యమంత్రి లక్ష్యం అని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డి.సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, స్థానిక ప్రజాప్రతినిదులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: శ్రీరామ నవమి ఏర్పాట్లపై మంత్రి పువ్వాడ సమీక్ష..