Telugu News

దేశంలో, రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ వైఖరులపై తీవ్రంగా విమర్శించిన రాష్ట్ర పంచాయతీరాజ్.

గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. 

0

దేశంలో, రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ వైఖరులపై తీవ్రంగా విమర్శించిన రాష్ట్ర పంచాయతీరాజ్.

గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్, trs రాష్ట్ర నాయకులు సా0బారి సమ్మరావు తో కలిసి మంత్రి హన్మకొండలోని తన నివాసంలో మీడియా తో మాట్లాడారు.

*వరి ధాన్యం కొనుగోలు పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాయి.
*ఆ పార్టీ నేతలు కొందరు పిచ్చి కూతలు కూస్తున్నరు.
*దేశంలో ఏ రాష్ట్రంలో నైనా రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొంటున్నయా?
*రేవంత్ రెడ్డి ఫక్కీరు వేషాలు మానుకోవాలి
*తొండి సంజయ్ మాటలకు విలువ లేదు
*రైతుల ధాన్యాన్ని కేంద్రం ఎంత మేరకు కొంటుందో స్పష్టం చేయాలి
* ధాన్యం కొనుగోలు విష‌యంలో కేంద్రం నిర్ణ‌యం కోసం ఎదురుచూస్తున్నాం.
*సీఎం గారికి కనీసం *కనీసం అప్పాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు.
*Appointment ఇచ్చిన కేంద్ర మంత్రులు స్పష్టతను ఇవ్వడం లేదు.
* రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం ఎంత‌కైనా సిద్దంగా ఉంది.
* సియం కేసిఆర్ ఆద్వ‌ర్యంలో డిల్లిలో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుంది.
* తెలంగాణ ప‌ట్ల కేంద్రం ప్ర‌భుత్వం వివ‌క్ష చూపుతుంది.
* కేంద్రంలోని బిజేపి తెలంగాణ హ‌క్కుల‌ను కాల‌రాస్తుంది.
* రైతుల‌పై మొస‌లి క‌న్నీరు కారుస్తున్న పార్టీలు డిల్లీలో త‌మ స‌త్తా చాటాలి.
* రాజ‌కీయాల కోసం ఇక్క‌డ తిరుగ‌డం కాదు.. డిల్లీ మెడ‌లు వంచేందుకు తెలంగాణ ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాలి.
* తెలంగాణ‌లో రైతులు వానాకాలంలో పండించిన ప్ర‌తి ధాన్యం గింజ‌ను కొనుగోలు చేస్తాం.. రైతులు సంయమ‌నం పాటించాలి.
* రైతు పండించే పంటలకు కనీస మద్దతు ధర కల్పించడానికి వెంటనే చట్టాన్ని రూపొందించాలి
* కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 3 రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా అన్నదాతల పోరాట ఫలితంగా కేంద్రం ఈ చట్టాలను ఉపసంహరించుకున్నది.
* కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతులు ప్రయోజనాలు వ్యతిరేకంగా ఉన్నాయి.
* 2020 సంవత్సరంలో రూపొందించిన ఈ మూడు నల్ల రైతు చట్టాలు
1. కాంట్రాక్టు వ్యవసాయానికి చట్టబద్ధం కల్పించుట.
2. రైతులు పండించిన వంట ఎక్కడైనా విక్రయించే వీలు కల్పించుట.
3. ఆహార ఉత్పత్తులను ఎంతైనా నిల్వ చేసుకునే వీలు.
* దేశంలో జరిగిన రైతు ఉద్యమాల ఫలితంగా ఈ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు.
*నల్ల చట్టాల ఉపసంహరణ కోసం అమరులైన 700 మందికి పైగా రైతులు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి మూడు లక్షల రూపాయల చొప్పున మొత్తం 21 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఇవ్వనున్నట్లు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారు.
* మానవతా దృక్పథంతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయానికి దేశవిదేశాల నుండి ప్రశంసలు అందుతున్నాయి.
* కేంద్ర ప్రభుత్వం కూడా రైతు ఉద్యమంలో అమరులైన 700 మందికి పైగా కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయల చొప్పున వెంటనే ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నాము
* అదేవిధంగా రైతు ఉద్యమ ఈ సందర్భంగా రైతుల పై పెట్టిన అన్ని రకాల కేసులను వెంటనే ఉపసంహరించాలని కోరుతున్నాము.
* మూడు రైతు చట్టాల ఉపసంహరణలు పాటుగా రైతులు ప్రయోజనం చేకూర్చే ఈ క్రింది అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము
* దేశ ప్రజలకు ప్రధానంగా రైతుల పాలిట శాపంగా ఉన్న విద్యుత్తు చట్టాలను వెంటనే ఉపసంహరించుకోనే ఈ విధంగా చర్యలు తీసుకోవాలి
* రైతులు వినియోగించే వ్యవసాయ విద్యుత్ పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని రాష్ట్రాలను ఒత్తిడి చేయడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి
* రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికి ఏడు సంవత్సరాలు కావస్తున్నది కానీ ఇప్పటికీ విభజన హామీలు నెరవేర్చడం లేదు
ఈ హామీలను వెంటనే నెరవేర్చి తెలంగాణ ప్రజలకు న్యాయాన్ని చేకూర్చాలి
* ఎన్నో ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న కృష్ణా జలాల పంపిణీ చర్యలు గైకొనాలి అందుకోసం కృష్ణ ట్రిబ్యునల్ వెంటనే ఏర్పాటు చేయాలి
* రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలంలో తెలంగాణ రాష్ట్రంలో పండించిన మొత్తం ధాన్యాన్ని ఎఫ్ సి ఐ ద్వారా కొనుగోలు చేయాలి.
అదే విధంగా వచ్చే యాసంగి లో రాష్ట్రంలో వరి పండించడానికి అనుమతివ్వాలి.
* ఎంతవరకు వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయాన్ని పంట వేయకముందే వ్రాతపూర్వకంగా తెలియజేయాలి.
* తెలంగాణ రాష్ట్రంలో పండిస్తున్న దొడ్డు రకం బియ్యం కేంద్రం ఏళ్లుగా సేకరిస్తున్న ది ఆ అనవాలునే కొనసాగించాలని కోరుతున్నాము.
* తెలంగాణ రాష్ట్రంలో వ్యాసంగంలో పండించే మూడు ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు నిజానికి రాష్ట్రంలో యాసంగి లో పండిన ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా మారుస్తారు. వాటి కొనుగోలు పై స్పష్టత ఇవ్వకుండా ముడి బియ్యం మాత్రమే కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పటం దేనికి సంకేతమో తెలపాలి
* భవిష్యత్తులో వానాకాలం యాసంగి లో ఎంత వేస్తారో కేంద్రం ముందే ప్రకటించాలి దీనివల్ల రాష్ట్రంలో ఏ పంట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వీలుంటుంది.

also read :- కరెంట్ షాక్ తో యువకుడు మృతి.