రాష్ట్ర ప్రజలకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు..మంత్రి పువ్వాడ.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి.
రాష్ట్ర ప్రజలకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు..మంత్రి పువ్వాడ.
◆ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి.
◆ సిఎం కేసిఆర్ గారి నాయకత్వంలోనే పండగలకు ప్రాశస్త్యం లభించింది.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ పర్వదినం సందర్భంగా ఆ భగవంతుని చల్లని చూపులు తెలంగాణ రాష్ట్రం మీద ఎప్పటికీ ఉండాలని, అందరూ సుఖ, సంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.
also read :-నిబంధనలు అతిక్రమిస్తున్న వాహనాలపై ఆర్టీఏ అధికారులు కొరడా..
రాష్ట్రానికి కేసిఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక అన్ని పండగలు ఘనంగా జరుగుతున్నాయని, దేవాలయాలు బ్రహ్మండంగా అభివృద్ధి అయ్యాయని తెలిపారు. అన్ని మతాలకు , పర్వదినాలకు ప్రాధాన్యత ఇస్తూ లౌకిక స్పూర్తిని కాపాడుతున్నారని చెప్పారు.
కరోనా, ఒమీక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని, జనాలు గుమికూడే ప్రదేశాలకు వెళ్లకుండా కోవిడ్ నియమ, నిబంధనలు పాటిస్తూ ముక్కోటి ఏకాదశి జరుపుకోవాలని కోరారు.
మరోసారి రాష్ట్ర ప్రజలకు ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.