Telugu News

*ఉక్కు కర్మాగారం స్థాపించాల్సిందే: కూనంనేని

** 9న ఇందిరా పార్క్ వద్ద దీక్ష

0

*ఉక్కు కర్మాగారం స్థాపించాల్సిందే: కూనంనేని

** 9న ఇందిరా పార్క్ వద్ద దీక్ష

**బయ్యారంలో లక్షల కోట్ల ఖనిజ సంపద దేశానికి భారంగా బీజేపీ

** విలేకర్ల సమావేశంలో కూనంనేని

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్) :-

రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీమేరకు బయ్యారంలో ఉక్కుఫ్యాక్టరీ నిర్మించాల్సిందేనని సి.పి.ఐ మరో చారిత్రక పోరాటానికి సిద్ధమవుతుందని సి.పి.ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాజీ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు తెలిపారు. లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపదను కాపాడిన చరిత్ర సి.పి.ఐకి సొంతమని ఆయన చెప్పారు. శనివారం స్థానిక సి.పి.ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బయ్యారం, గార్ల, గూడూరు, నేలకొండపల్లిమండలాలలో లక్షల కోట్ల విలువైన ఖనిజన సంపద నిక్షిప్తమై ఉందని, చుట్టూ ఉక్కు కర్మాగారానికి కావలసిన ముడి సరుకు అపారంగా లభ్యమవుతుందని ఆయన తెలిపారు.

also read :-గొల్ల కురమ సోదరుల గుండెల మీద తన్నిన కెసీఆర్ : భట్టి విక్రమార్క

గతంలో 1.40 లక్షల ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం రక్షణ స్టీలు ్క లీజుకిచ్చిందని కందుల శివారెడ్డి, కందుల రాజమోహన్రెడ్డి,కొండల్రావు ఇంకా అనేక మంది గిరిజన, ఇతర సొసైటీపేరుతో ఖనిజాన్ని తరలించక పోవుతున్న తరుణంలో *సి.పి.ఐ అడ్డుగా నిలిచిందన్నారు. అప్పుడు సి.పి..ఐ శాసనమండలి సభ్యులు పువ్వాడ నాగేశ్వరరావు, శాసనసభ్యులుగా నేను, చంద్రవతి, శాసనసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగిందని, 2010 సెంబ్లీలో బయ్యారం తరలింపుపై గంట పాటు చర్చ జరిగిందన్నారు. సి.పి.ఐ ఆధ్వర్యంలో లక్షమందితో జిల్లాను దిగ్భందించామని, బైరెటీస్, ఐరన్ తరలింపుకు వ్యతిరేకంగా పోరడంటతో పాటు బయ్యారంలో ఓబులాపురంకు మించిన ఖనిజ సంపద దొరుకుతుందని సి.పి.ఐ నిరూపించిందని ఎట్టకేలకు 2010 ఆగస్టు 9న కేంద్రప్రభుత్వం లీజ్ను రద్దు చేసిందన్నారు.

also read :-నూతన కలెక్టరేట్ భవననిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి- మంత్రి పువ్వాడ.

రాష్ట్ర విభజనసమయంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం కేంద్ర ప్రభ్వుం హామీ ఇచ్చిందన్నారు. ఎఫ్.సి.రకం బొగు 300 మిలియన్ టన్నులు బయ్యారంలో లభ్యమవుందని ఎటువంటి ఖనిజ సంపదలేకుండానే రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని విశాఖలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించారని సాంబశివరావు గుర్తుచేశారు. కమ్యూనిస్టు శాసనసభ్యులు రాజీనామా చేశారని, ఇప్పుడు సి.పి.ఐ బహుముఖపోరాటాలకు సిద్ధంగా ఉందన్నారు. ఈనెల 9న బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు నినాదంతో ఒక్క రోజు నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు అన్ని రాజకీయపార్టీలను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు.

బయ్యారం ఉక్కు కర్మాగారం సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టంచేశారు. టి.ఆర్.ఎస్ కూడా నైతికబాధ్యత వహిస్తూ బయ్యారం ఉక్కు సాధనకు ప్రత్యక్షకారాచరణ చేపట్టాలని ఆయన తెలిపారు. రాష్ట్రంలో జీడీపీ వృద్ధి రేటు కనిపిస్తున్నా అది సామాన్యుల ధరిచేరడం లేదని, సామాన్యులకు నేరుగా లబ్ది జరిగేవిధంగా వ్యక్తి కేంద్రంగా బడ్జెట్ రూపకల్పన జరగాలని, సాంబశివరావు కోరారు. నూతన ఫించన్లు, అసంఘటిత రంగ కార్మికులు, ఫీల్డ్ అసిస్టెట్లు, అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలన్నారు.

శాసనసభా సమావేశాలకు రాష్ట్ర గవర్నర్ను ఆహ్వానించక పోవడం పై స్పందిస్తూ బీజేపీ, టి.ఆర్.ఎస్.ల రాజకీయ వైరుధ్యాల నేపథ్యంలో ఇది జరిగిందని, రాజ్యాంగ అంశాలు. గవర్నల పెత్తందారితనం తదితర అంశాలున్నాయన్నారు. బీజేపీ విచ్చిన్నకర చర్యలకు పాల్పడుతూ దేశానికి భారంగా మారిందన్నారు. రానున్న కాలంలో లౌకిక, ప్రజాతంత్ర వామపక్ష తదితరులను ఐక్యం చేసుకొని ముందుకు సాగుతామన్నారు. ఈ విలేకర్ల సమావేశంలో సి.ఐరాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు, సి.పి.ఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు