ప్రభుత్వ భూములును అక్రమిస్తే ఉక్కుపాదం : మంత్రి పువ్వాడ
★ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హెచ్చరిక ★ క్రైస్తవుల సమాధుల తోట ప్రాకారము ప్రారంభం
ప్రభుత్వ భూములును అక్రమిస్తే ఉక్కుపాదం : మంత్రి పువ్వాడ
★ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హెచ్చరిక
★ క్రైస్తవుల సమాధుల తోట ప్రాకారము ప్రారంభం
(ఖమ్మం – విజయంన్యూస్) :-
ఖమ్మం నగరంలో ప్రభుత్వ భూములను ఎవరూ ఆక్రమించిన ఉపేక్షించేది లేదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హెచ్చరించారు. నగరంలోని రోటరీ నగర్ వద్ద క్రైస్తవుల సమాధుల తోట ప్రాకారమును సోమవారం మంత్రి పువ్వాడ ప్రారంభించారు.
ముందుగా ఆయన క్రైస్తవ ప్రార్థిన మందిరం వద్దకు వస్తుండగా దూరప్రాంతం నుంచి క్రైస్తవులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రార్థనలు చేశారు.
also read :- గ్రంథాలయాలే… ఆధునిక దేవాలయాలు!
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ క్రైస్తవుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములును ఆక్రమణకు గురికాకుండా చర్యలను చేపట్టామని మంత్రి పువ్వాడ తెలిపారు,
ఈ కార్యక్రమంలో నగర మేయర్ పూనకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, స్థానిక కార్పోరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
also read :- ఘనంగా గాయత్రి రవి పుట్టిన రోజు వేడుకలు