Telugu News

నాసిరకం విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు: ఏడీఏ బేగం

అశ్వారావుపేట అగ్రికల్చర్ ఏడిఏ అఫ్జల్ బేగం

0

నాసిరకం విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు: ఏడీఏ బేగం
– రైతులు విత్తన బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి
– అశ్వారావుపేట అగ్రికల్చర్ ఏడిఏ అఫ్జల్ బేగం
– రైతులను మోసం చేస్తే పీడీ యాక్ట్ నమోదు
– సబ్ ఇన్స్ స్పెక్టర్ మాచినేని రవి

చండ్రుగొండ/ అన్నపురెడ్డిపల్లి మే 23 ( విజయం న్యూస్ ) (రిపోర్టర్- బొగ్గుల శివనాగిరెడ్డి)

ప్రభుత్వ ఆమోదం కంపెనీ విత్తనాలు కాకుండా నాసరికం విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని అశ్వరావుపేట అగ్రికల్చర్ ఏడిఏ అఫ్జల్ బేగం విత్తన డీలర్లను హెచ్చరించారు. గురువారం చండ్రుగొండ రైతు వేదికలో అగ్రికల్చర్, పోలీస్ డిపార్ట్మెంట్, ఆధ్వర్యంలో ఐదు మండలాల స్థాయి విత్తన, పురుగు మందుల, డీలర్లు, షాపుల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అశ్వరావుపేట, దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, మండలాలకు చెందిన విత్తన డీలర్లు, పురుగుమందు షాపుల యజమానులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:- అన్నపురెడ్డిపల్లిలో  90 క్వింటల రేషన్ బియ్యం పట్టివేత

ఈ సందర్భంగా అగ్రికల్చర్ ఏడిఏ అఫ్జల్ బేగం మాట్లాడుతూ.. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో విత్తన డీలర్లు రైతులకు ప్రభుత్వం ఆమోదం పొందిన కంపెనీ విత్తనాలను మాత్రమే విక్రయించాలన్నారు. రైతులకు అమ్మిన ప్రతి రసీదు పై రైతు సంతకం తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అలాగే రైతులకు అందించే విత్తనాల వివరాలు బిల్ వెనుక ఉండాలన్నారు. రైతులకు విత్తనాలు ఇచ్చేముందు వారి భూములను పరిశీలించి విత్తనం నాటాల వద్దా అనే విషయాన్ని రైతులకు క్లుప్తంగా వివరించాలన్నారు. ముఖ్యంగా భూమిలో తేమశాతాన్ని గుర్తించాలన్నారు. రైతులు వారి ఇష్టమైన విత్తనాలను అడిగినప్పుడు వాటిని మాత్రమే విక్రయించాలన్నారు. అలా కాదని ఇవి మంచివి అవి మంచివి అని రైతులకు బలవంతంగా మీరు విత్తనాలు అంట కడితే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఈ ప్రాంతం మొత్తం గిరిజన ప్రాంతం కాబట్టి గిరిజనులకు ఎలా పంటలు వేయాలో ఇప్పటివరకు తెలియదని. వాటికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఏఈవోలు, విత్తన డీలర్లు, గ్రామాల్లో పర్యటించి రైతులు అవగాహన పెంపొందించాలన్నారు. ముఖ్యంగా వ్యవసాయం యాజమాన్యం పద్ధతిలో జరిగే విధంగా చూసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులపై ప్రత్యేక దృష్టి సారించిందని. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు స్కాడ్లను నియమించడం జరిగిందన్నారు. ఏ క్షణంలోనైనా వారు షాపులపై రైట్ చేసే అధికారం ఉందన్నారు. అలాగే రైట్స్ చేసే సమయంలో ఎవరైనా కావాలని చెప్పి షాపులను మూసివేస్తే. అట్టి షాపుల లైసెన్సులను సైతం రద్దు చేస్తామని హెచ్చరించారు. రైతులు కూడా ప్రభుత్వం ఆమోదం పొందిన విత్తనాలనే కొనుగోలు చేయాలన్నారు. గ్రామాల్లో ఎవరైనా తిరిగి అమ్మేవారి వద్ద ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనుగోలు చేయవద్దన్నారు. అలా ఎవరైనా విత్తనాల అమ్మినట్లు మీ దృష్టికి వస్తే వెంటనే స్థానికంగా ఉన్న వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్ స్పెక్టర్ మాచినేని రవి మాట్లాడుతూ… రైతులకు నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వెంటనే ఆ షాపు యజమానిపై పీడి యాక్ట్ కింద నమోదు చేయడం జరుగుతుందన్నారు. రైతులకు కంపెనీ వివరాలు తెలియవు కాబట్టి. ఆ విత్తనాలు మీరే తెచ్చి అమ్ముతున్నారు కనుక ఆ బాధ్యత కూడా మీపైనే ఉంటుందన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విత్తనాలు ప్రభుత్వ ఆమోదించినా విత్తనాలను మాత్రమే విక్రయించాలన్నారు. అలాగే రైతులు కూడా తాము కొనుగోలు చేసిన బిల్లులను తమ పంటలు అమ్ముకునేంతవరకు తమ వద్ద భద్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐదు మండలాల ఏవోలు వినయ్, కరుణామయి, నవీన్, అనూష, ఏఈఓ లు విత్తన, పురుగుమందుల, షాపుల డీలర్లు, పాల్గొన్నారు.