Telugu News

విద్యార్థిగా మారిన కలెక్టర్

== నేలపై కుర్చోని విద్యార్థులతో కలిసి భోజనం చేసిన వి.పి.గౌతమ్

0
విద్యార్థిగా మారిన కలెక్టర్
== నేలపై కుర్చోని విద్యార్థులతో కలిసి భోజనం చేసిన వి.పి.గౌతమ్
== కస్తూరిభగాంధీ పాఠశాలను పరిశీలించిన కలెక్టర్
ఎర్రుపాలెం/ఖమ్మం సెప్టెంబరు,21(విజయంన్యూస్):`

విద్యార్థిమారారు.. చిన్నారులతో కలిసికుర్చున్నారు.. పాఠాలు విన్నారు.. మధ్యాహ్న భోజనం బెల్లుకు విద్యార్థులతో కలిసి బయటకు వచ్చారు.. విద్యార్థులతో నేలపై కుర్చున్నారు.. విద్యార్థులు తినే మధ్యాహ్న భోజనం తిన్నారు.. తినే సమయంలో విద్యార్థులతో ముచ్చట్లుపెట్టారు.. విద్యార్థుల పరిస్థితి..ఉపాధ్యాయుల పరిస్థితి.. పాఠశాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కలెక్టర్ అడిగి ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
దీంతో విద్యార్థులను అభినందించారు. అయితే విద్యార్థులతో నేలపై కుర్చోని విద్యార్థులు చేసే మధ్యాహ్న భోజనం చేయడం, ముచ్చట్లు పెట్టడంతో చిన్నారులు మస్తు కుషి అయ్యారు ఇంతకు ఎవరనేగా మీ ప్రశ్నంతా..? నిజమే ఆయన ఖమ్మం కలెక్టర్ వి.పి.గౌతమ్. ఎర్రుపాలెం కస్తూరిబా గాంధీ విద్యాలయంను కలెక్టర్‌ పరిశీలించి విద్యార్ధులకు కల్పిస్తున్న సౌకర్యాల వివరాలను తెలుసుకొన్నారు.  అదనపు భవనంను వినియోగించాలని,  విద్యుత్‌ సరఫరాను మెరుగుపర్చాలని, నిరంతరం విద్యుత్‌ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ శాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.  అదనపు టాయిలెట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని కలెక్టర్‌ ఆదేశించారు.  విద్యార్ధులకు మెను ప్రకారం పాలు, పెరుగు మంచి పౌష్టికాహరం అందించాలని పాఠశాల ప్రత్యేక అధికారి నిరంతరం పర్యవేక్షించాలని  కలెక్టర్‌ ఆదేశించారు.అనంతరం విద్యార్థినిలతో కలిసి కలెక్టర్‌ బోజనం చేశారు.    కలెక్టర్ సార్ మాతో ఉండటం చాలా ఆనందంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు.
== పీహెచ్ సీని పరిశీలించిన కలెక్టర్ 
ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామంలో  పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌  గురువారం క్షేత్రస్థాయిలో తణిఖీ చేశారు.  ప్రాథమిక ఆరోగ్యకేంద్రం నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు.   పనులను  వేగవంతం చేసి త్వరితగతిన  పూర్తయ్యెలా చర్యలు తీసుకోవాలని సంబంధిత కాంట్రాక్టర్‌, అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.  పనుల్లో అలసత్వం వహిస్తే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్‌ తెలిపారు. కలెక్టర్‌ వెంట శిక్షణ అసిస్టెంట్‌ కలెక్టర్‌ మయాంక్‌ సింగ్‌, జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖర శర్మ, ఎంపిడిఓ శ్రీనివాసరావు, విద్యుత్‌ శాఖ ఏడి అనురాధ, ఎంఈఓ ప్రభాకర్‌, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: పాలేరు కు పొంగులేటి