పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు ధర్నా..!
** పాఠశాలలో మౌలిక వసతుల తో పాటు ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ... కామేపల్లి మండల పరిధిలోని భాసిత్ నగర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రహదారిపై శనివారం ఆందోళన చేశారు.
** పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు ధర్నా..!
** పాఠశాలలో మౌలిక వసతుల తో పాటు ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ…
కామేపల్లి మండల పరిధిలోని భాసిత్ నగర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రహదారిపై శనివారం ఆందోళన చేశారు.
(కామేపల్లి – విజయం న్యూస్):-
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల హై స్కూలు రెండు ఒకే భవనంలో కొనసాగుతున్నాయని,
240 మంది విద్యార్థులు ఉండగా ఏడు సబ్జెక్టులకు గాను..,
ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే బోధిస్తున్నారు,
అని మిగతా సబ్జెక్టు పరంగా తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులకు సరిపడా గదులు లేకపోవడంతో ఒకే గదిలో రెండు తరగతుల నిర్వహిస్తున్నారని అదనపు గదుల నిర్మాణం తో పాటు. ఉపాధ్యాయులను నియమించాలని ధర్నా చేశారు. గ్రామ సర్పంచి బాలు నాయక్ ఆందోళన కారులను శాంతింపజేసి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని చెప్పడంతో ఆందోళన విరమించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.
also read :- చిన్నారికి పెద్ద కష్టం దయగల దాతలు దయ చూపండి.
also read :- వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవులు ఇవ్వే..
please share, subscribe, & like my channel :- smiling chaithu