పోటీ పరీక్షలతో నైపుణ్యం పెరుగుతుంది.
(ఏన్కూరు విజయం న్యూస్):-
కోడి పరీక్షలు రాయడం వలన నైపుణ్యం పెరుగుతుంది ఎస్సై సాయి కుమార్ అన్నారు. ఆదివారం ఏన్కూర్ లోని ఉషోదయ పాఠశాలలో రైట్ ఛాయిస్ అకాడమీ ఖమ్మం వారి ఆధ్వర్యంలో కానిస్టేబుల్,ఎస్ఐ,గ్రూప్ 2,3,4 ఉచిత టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఎస్ ఐ సాయి కుమార్ హాజరయ్యారు.
also read :-ఈరోజు హాజీపూర్ గ్రామం లో తల్లిదండ్రులు లేని అమ్మాయి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఇలాంటి పోటీ పరీక్షలు రాయడం వలన వారిలో ప్రతిభ పెరుగుతుందని అన్నారు. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువ మంది సాధించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గుడ్ల వెంకటేశ్వరావు,పాఠశాల ప్రిన్సిపాల్ చావా ప్రభాకర్ రావు, రిటైర్డ్ టీచర్ బాబురావు సామాజిక సేవ కార్యకర్త కొoట్టు సాంబయ్య, 80 మంది అభ్యర్థులు పాల్గొన్నారు.