Telugu News

గార్లఒడ్డు దేవాలయంలో అధ్యయనోత్సవాలు

గార్లఒడ్డు దేవాలయంలో అధ్యయనోత్సవాలు

0

గార్లఒడ్డు దేవాలయంలో అధ్యయనోత్సవాలు

== ఈనెల 21నుంచి 25వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలు 

ఏన్కూరు మే 18(విజయం న్యూస్):
ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవి ఈనెల 20 వరకు జరగనున్నాయి.ఈనెల 21 నుంచి 25వ తారీకు వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకుగాను దేవాలయాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.ఈనెల 23న రాత్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం మహోత్సవం జరగనుంది.అధ్యయనోత్సవాలు ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజర్ శేషయ్య, ప్రధాన అర్చకులు బిటుకూరి వేణుగోపాలచార్యులు, నాగరాజాచార్యులు,కిరణ్ కుమార్ చార్యులు భక్తులు పాల్గొన్నారు.