Telugu News

శిథిలావస్థలో విజ్ఞాన భాండాగారం కథనానికి స్పందించిన అధికారులు

దాశరధి గ్రంథాలయం డెవలప్ చేస్తాం...!

0

శిథిలావస్థలో విజ్ఞాన భాండాగారం కథనానికి స్పందించిన అధికారులు

—-దాశరధి గ్రంథాలయం డెవలప్ చేస్తాం…!

—-స్పెషల్ ఆఫీసర్ సుధాకర్

(మహబూబాబాద్-చిన్నగూడూరు విజయం న్యూస్)

మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన దాశరధి విజ్ఞాన భాండాగారం లైబ్రరీ దీన స్థితి పై ఇటీవల విజయం దినపత్రిక తో పాటు పలు పత్రికలలో శిధిలావస్థలో విజ్ఞాన భాండాగారం కథనాలు రాగా దాశరధి వారసులు లక్ష్మణ్ విజ్ఞప్తి మేరకు స్పందించిన మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశాల మేరకు డోర్నకల్ నియోజకవర్గ పల్లె ప్రగతి స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ శుక్రవారం చిన్నగూడూరు దాశరథి లైబ్రరీ నీ సందర్శించారు.

also read ;-నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సీతక్క కుమారుడు సూర్య

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిథిలావస్థకు చేరిన గ్రంథాలయ పరిస్థితి గురించి,నూతన భవనం ఆవశ్యకత గురించి, అదేవిధంగా చిన్నగూడూరు మండల కేంద్రంగా మారినందున లైబ్రరీ అప్గ్రేడ్ చేసే అంశం గురించి నివేదిక ఇస్తాం అని అన్నారు. లైబ్రరీ మెయింటినెన్స్ బిల్లులు గత మూడు సంవత్సరాలుగా చెల్లించడం లేదని,లైబ్రరీ కమిటీ తెలుపగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. దాశరథి జయంతి లోగా లైబ్రరీ సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్యాంసుందర్, గ్రామ సర్పంచ్ కొమ్ము మల్లయ్య, కార్యదర్శి అజీమ్, గ్రంధాలయ నిర్వాహకులు గాడి పల్లి సత్యనారాయణ,మండల కో ఆప్షన్ సభ్యులు మోసిన్ బేగ్, గ్రంథాలయ కమిటీ సభ్యులు దేశ గాని నారాయణ, బ్రహ్మం నీలం శంకరయ్య, గ్రామస్తులు గాడిపెల్లి అనిల్, సైదులు, శివయ్య, తదితరులు పాల్గొన్నారు.