Telugu News

జాతీయ స్థాయి కథల పోటీలో తడపాకల్ విద్యార్థికి బహుమతి

0

జాతీయ స్థాయి కథల పోటీలో
తడపాకల్ విద్యార్థికి బహుమతి
(విజయంన్యూస్ఏ ర్గట్ల):-

ఏర్గట్ల మండలo లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తడపాకల్ లో ఎనిమిదవ తరగతి చదువుతున్న బడి గిరి నిఖితకు జాతీయ స్థాయి కథల పోటీలలో బహుమతి లభించింది. వురిమళ్ల పౌండేషన్ ఖమ్మం వారు గత డిసెంబర్ నెలలో రెండు రాష్ట్రాలలో పాఠశాల విద్యార్థులకు కథల పోటీ నిర్వహించగా అందులో 600 కు పైగా విద్యార్థులు రాసిన కథలు వచ్చాయని,

also read;-“లోక్యతండా” లో కామదాహనం

అందులో నుండి అత్యుత్తమమైన 30 కథలను ఎంపిక చేశారని అందులో తడపాకల్ ఉన్నత పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న బడిగిరి నిఖిత రాసిన “సమానత్వం” అనే కథ ఎంపికఅయిందని పాఠశాల తెలుగు పండితులు ప్రవీణ్ శర్మ తెలియజేశారు. బహుమతి సాధించిన విద్యార్థినికి త్వరలోనే నగదు బహుమతితో పాటు జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రము నునిర్వాహకులు అందజేస్తారని ప్రవీణ్ శర్మ తెలియజేశారు.జాతీయ స్థాయిలో బహుమతి పొందిననిఖిత ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు ఉపాధ్యాయ బృందం అభినందించారు.