Telugu News

కంగుతిన్న కాషాయ నేతలు ఖమ్మం

మంత్రి అజయ్‌కే మద్దతుగా మేడే భారీ ర్యాలీ

0

కంగుతిన్న కాషాయ నేతలు  ఖమ్మం

మంత్రి అజయ్‌కే మద్దతుగా మేడే భారీ ర్యాలీ

పువ్వాడపై పువ్వు పార్టీ కుట్రలు పటాపంచలు!!

(ఖమ్మం విజయం న్యూస్ ):-

రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ఇరుకున పెట్టాలని ఇటీవల ఖమ్మం నగరంలో శవ రాజకీయాల పేరుతో కొత్త రాగమెత్తుకొన్న బీజేపీ నాయకుల ప్రయత్నం బెడిసికొట్టింది. మంత్రిని ఇరుకున పెట్టే మాటేమిటో కానీ.. పూర్తిగా అల్లిన కథ, శవం చుట్టూ తిప్పి రాజకీయ క్రీడలో వికెట్లు వలె కోల్పోయింది. రాష్ట్ర ప్రభుత్వానికి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి వ్యతిరేకంగా ప్రజలు నడుంబిగించాలని రాష్ట్ర, జిల్లా బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. కానీ ప్రజలేమో వారికి వ్యతిరేకంగా నేరుగా మంత్రి అజయ్‌కే సంపూర్ణ మద్దతు ఇచ్చి మేడే సందర్భంగా భారీ ర్యాలీ చేపట్టి బీజేపీ నాయకులకు రివర్స్‌ షాకిచ్చారు. మొదట నుంచి బీజేపీ వికృత పోకడలను ఖమ్మం ప్రజలు ముక్తకంఠంతో ఆగ్రహించి వ్యతిరేకిస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు.

also read :-ప్రైవేట్ మాటున పెరుగుతున్న శ్రమదోపిడి…

సొంత అజెండాతో పార్టీని పటిష్టం చేసుకునే అవకాశం లేని బీజేపీ నాయకులు వింత దోరణిలో పయనిస్తూ ఇటువంటి అంశాలను తెరమీదకు తెస్తూ, కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్నారని పలువురు రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో గెలవడానికి మరియు రాజకీయ ఉనికి కోసం బీజేపీ మత ఘర్షణలను ఆయుధంగా వాడుకొంటున్నదని బహిరంగంగా చర్చించుకుంటున్న అంశమే.

also read :-కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ

ఎన్నికలు దగ్గరపడితే ఏ రాజకీయ పార్టీ నేతలైనా.. తమ హయాంలో జరిగిన అభివృద్ధి, అమలుచేయబోయే పథకాల గురించి ఓటర్లకు వివరిస్తారు. బీజేపీ నేతలు ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. సరిగ్గా ఎన్నికల ముందు మతతత్వాన్ని ముందర వేసుకోవడం రివాజుగా మారింది. లౌకిక నగరంలో మతచిచ్చు రాజేస్తూ.. విద్వేష ప్రసంగాలతో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొంటూ ఓట్లను దండుకునే సంస్కృతిని ఆ పార్టీ కొన్నేండ్లుగా పాటిస్తున్నది. అందులో భాగమే గత ఏడాది నుంచి ఖమ్మం నగరంలో బీజేపీ నాయకులు చేస్తున్న రాజకీయం. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను టార్గెట్ గా చేసుకుని తమ ఉనికిని సృష్టించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు.

also read :-తాడ్వాయి మండలం లో ఘనంగా మే “డే” వేడుకలు

పువ్వాడ అజయ్ వ్యూహం అనూహ్యం. ఆ మార్గం దుర్గమం. ఆ అడుగు జాడల్లో నడుస్తూ ఉంటే అప్పటివరకూ అసాధ్యమన్న వారిలో కూడా ఆశ చిగురించటం మొదలవుతుంది. అది క్రమంగా ఆత్మవిశ్వాసం అవుతుంది. తుఫాను సృష్టించే ప్రజా ఉద్యమం మహోత్తుంగ తరంగమవుతుంది. ఆయన స్వప్నం అప్పుడు ప్రజల లక్ష్యమవుతుంది. చివరికి ప్రజానీకం ఆ లక్ష్యాన్ని చేరుకొని విజయ దరహాసం చేస్తుంది. ఇది కాల్పనికత కాదు, కళ్ళముందున్న చరిత్ర అది అభివృధ్ది తెలియని ఖమ్మం ప్రజలకు, ప్రాంతానికి అభివృద్ధిని చేసి చూపించడంలో ఉన్నది. అదే పంథాలో ఇప్పుడు బీజేపీ చేస్తున్న ఇటువంటి విద్వేష రాజకీయాలను మంత్రి అజయ్ నాయకత్వంలో బద్దలు కొట్టవలసిన అవశ్యకత ఎంతైనా ఉంది.