పలు పేద కుటుంబాలకు ఉపసర్పంచ్ ఆర్థిక సహాయం.
( ఏన్కూరు విజయం న్యూస్):-
మండల కేంద్రమైన ఏన్కూరు, ఆరి కాయలు పాడు గ్రామాల్లో పలు పేద కుటుంబాలకు శుక్రవారం ఆరికాయలపాడు ఉప సర్పంచ్ గుడ్ల వెంకటేశ్వర్లు ఆర్థిక సహాయం అందజేశారు. ఆరికాయలపాడు గ్రామంలో కొంగర వెంకటేశ్వర్లు కుటుంబానికి ఐదు వేల రూపాయలు, బట్టు శ్రీనివాసరెడ్డి కుటుంబానికి రెండు వేల రూపాయలు, ఏన్కూర్ లోని అతని స్నేహితుని కుమార్తె వివాహానికి ఐదువేల రూపాయలను ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్ దుగ్గిరాల ముత్తమ్మ, వార్డు సభ్యుడు హనుమంత్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి కోటమ్మ, మందడపు వెంకటేశ్వరరావు, ప్రతాపనేని అప్పారావు, గుడ్ల రామ, దొంతబోయిన కృష్ణ, సిలువేరు రామారావు తదితరులు పాల్గొన్నారు.