Telugu News

రైతులతో రచ్చబండను విజయవంతం చేయండి – మొక్క శేఖర్ గౌడ్

రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వెపకుంట్ల గ్రామము లొ ఈ నెల 28 న జరిగే రైతులతో రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఖమ్మం నగర కాంగ్రెసు అధ్యక్షులు MD జావెద్ జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్ లు కోరారు.

0

రైతులతో రచ్చబండను విజయవంతం చేయండి – మొక్క శేఖర్ గౌడ్

 

(ఖమ్మం – విజయంన్యూస్)
రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వెపకుంట్ల గ్రామము లొ ఈ నెల 28 న జరిగే రైతులతో రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఖమ్మం నగర కాంగ్రెసు అధ్యక్షులు MD జావెద్ జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్ లు కోరారు.

ఆదివారం నాడు రఘునాథపాలెం మండలం వేపకుంట లలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రంలో రైతుల పరిస్థితి తీవ్ర దుర్భరంగా మారిందని… రైతులు ఆరుగాలం పండించిన పంటను ప్రభుత్వాలు కొనకపోవటం వల్ల రైతులు కల్లాల వద్దనే ప్రాణాలు విడుస్తున్నారని. మిర్చి తోటలకు తామర పురుగు పత్తికి గులాబీ పురుగు పట్టి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

పెట్టుబడి పెట్టి తీరా పంట రావాల్సిన సమయంలో తామర పురుగు వల్ల ఎలాంటి దిగుబడి రాకుండా మిర్చిపంట నాశనమైపోతుందని…
ఈ విధంగా రైతుకు ఎప్పుడూ ఇలాంటి ఇబ్బంది రాలేదని దీని వల్ల చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఇలాంటి సందర్భంలో లో రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా వారికి ధైర్యం చెబుతూ రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ప్రభుత్వంపై పోరాడుతూ ఉండాలి తప్ప ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతుకు అండగా ఉండటం కోసం కిసాన్ కాంగ్రెస్ ఉంటుందని భరోసా ఇస్తూ రైతులతో రచ్చబండ కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకెట అన్వేష్ రెడ్డి రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ నాయకులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ పాల్గొంటారని…

కిసాన్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం
~~~~~
రైతులతో రచ్చబండ కార్యక్రమం అనంతరం జిల్లా కిసాన్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరుగుతుందని కావున ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు మండల కిసాన్ అధ్యక్షులు గ్రామ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ పాల్గొనాలని కోరారు.

ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెసు అధ్యక్షులు దొబ్బల సౌజన్య. కాంగ్రెస్ నాయకులు కార్పొరేటర్ మలీదు వేంకటేశ్వర్లు మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెమళ్ల రమేష్ మంచుకొండ సర్పంచి దీపక్ నాయక్ చల్లగండ్ల శ్రీనివాస్ రావు దుంపటి నగేష్ వేపకుంట్ల కాంగ్రెసు నాయకులు గునిగంటి రామారావు ప్రవీణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

 

also read:- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి కరోనా

also read :-కూసుమంచి పెట్రోల్ బంక్ లో వినియోగదారుల ఆందోళన..*