Telugu News

సక్సెస్ పంతులు చారిని సన్మానించిన ఎమ్మెల్యే

గురుకుల సీట్లు సాధించడంలో ఘనుడు చారి మాస్టారన్న ఎమ్మెల్యే

0

సక్సెస్ పంతులు చారిని సన్మానించిన ఎమ్మెల్యే

== గురుకుల సీట్లు సాధించడంలో ఘనుడు చారి మాస్టారన్న ఎమ్మెల్యే

ఏన్కూరు, జూన్ 20(విజయం న్యూస్)

గురుకుల సీట్లు సాధించడంలో మేటి ఆయన.. పల్లె విద్యార్థులకు దైవం ఆ గురువు.. చదువు చెప్పాడంటే సీటు పక్కా అనాల్సిందే..? అంతటి సక్సెస్ సాధించిన పల్లెటూరి పంతులు ఈ మాస్టారు.. ఎంతో మంది నిరుపేద విద్యార్థునులకు గురుకులాల్లో సీట్లు సాధించి తన ఊరికే గొప్ప పేరు తీసుకొచ్చిన ట్యూషన్ మాస్టార్ కృష్ణమాచారిని సాక్షాత్తూ వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఘనంగా సన్మానించారు.

 ఇది కూడా చదవండి: ఉపాధ్యాయులే సమాజానికి మార్గదర్శకులు: ఎస్ఐ

గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతిలో ప్రవేశాలకు శిక్షణ ఇస్తూ, ఎంతోమంది విద్యార్థులకు సీట్లు వచ్చే విధంగా కృషిచేసిన  మండల పరిధిలోని  తూతకలింగనపేట గ్రామానికి చెందిన జుజ్జురి కృష్ణమాచారిని  మంగళవారం వైరా ఎమ్మెల్యే లావుడియా  రాములు నాయక్, అధికారులు, ప్రజా ప్రతినిధులు  ఘనంగా సన్మానించారు.  విద్య దినోత్సవం సందర్భంగా  ఏన్కూరు లోని గురుకుల విద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కృష్ణమాచారి ని సన్మానించారు. ఎన్నో సంవత్సరాల నుంచి  ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన కృష్ణమాచారి గురుకుల విద్యాలయ ప్రవేశాలకు పరీక్ష రాసే విద్యార్థులకు తక్కువ ఫీజుతో టూషన్ చెబుతూ అత్యదిక సీట్లు సాధించడంలో సూపర్ సక్సెస్ సాధించారు. ఆ మాస్టార్ వద్ద చదువు చెప్పిస్తే, శిక్షణ ఇప్పిస్తే సీటు పక్కా అనే విధంగా ఆయన గొప్పపేరు సాధించారని ఎమ్మెల్యే కొనియాడారు. ఆయన ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారన్నారు.  చారి కృషి అభినందనీయమన్నారు.

ఇది కూడా చదవండి: సత్తా చాటిన టిఎల్ పేట విద్యార్థులు