Telugu News

విజయం పత్రికకు అండగా ఉంటా: మాజీ ఎంపీ పొంగులేటి

విజయం పత్రిక, క్యాలెండర్ ను అవిష్కరించిన మాజీ ఎంపీ

0

విజయం పత్రికకు అండగా ఉంటా: మాజీ ఎంపీ పొంగులేటి
విజయం పత్రిక, క్యాలెండర్ ను అవిష్కరించిన మాజీ ఎంపీ
హాజరైన టీఆర్ఎస్ పార్టీ నాయకులు
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
తెలంగాణ రాష్ట్ర అవిర్భవం రోజున డిజిటల్ మీడియాగా అవిష్కరణ అయిన ‘విజయం’ తెలుగుదినపత్రిక అనిత కాలంలోనే ప్రజల్లో మమైకమైందని, అతికొద్ది రోజుల్లో ప్రజా ఆశీస్సులు పొందిందని, అలాంటి పేపర్ ప్రింటింగ్ రూపంలో సంక్రాంతి రోజున ప్రజల ముంగిటకు రావడం చాలా సంతోషంగా ఉందని మాజీ ఎంపీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. విజయం తెలుగుదినపత్రికు అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. శనివారం సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఖమ్మంలోని మాజీ ఎంపీ పొంగులేటి నివాసంలో ‘విజయం’ తెలుగు దినపత్రిక, నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పత్రిక చైర్మన్ అండ్ ఎడిటర్ పెండ్ర అంజయ్యను అభినందించారు. ఆయనతో మాట్లాడారు.

also read :-ప్రింట్ మీడియా లో దూసుకెళ్తున్న ” విజయం పత్రిక”

పత్రిక వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిజమైన, నిఖార్సైన జర్నలిజం, విలువలతో కూడిన కథనాలను ప్రజలకు అందించాలని కోరారు.. ప్రతి వార్త ప్రజల కోసం ఉండాలని,నాయకుల కోసం, భజనల కోసం ఉండోద్దని అన్నారు. ప్రజల పక్షాన నిలబడే ప్రతి వార్తకు, ప్రతి పత్రికకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు. మంచి వార్తలను ప్రజలకు అందిస్తూ ప్రజల మన్ననలను పొందాలని, ప్రముఖ పత్రికల్లో ఒకటిగా ‘విజయం పత్రిక’ తనదైన శైలిలో గుర్తింపు సాధించాలని అకాంక్షించారు.

also read :-విజయం పత్రికను ప్రారంభించిన సీఎల్పీ నేత భట్టి

. జర్నలిస్టులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని హామినిచ్చారు. విజయం పత్రిక చైర్మన్ అండ్ ఎడిటర్ పెండ్ర అంజయ్య మాట్లాడుతూ జూన్ 2న డిజిటల్ మీడియా ద్వారా విజయం పత్రిక అవిష్కరించడం జరిగిందని,ఎనిమిది నెలల కాలంలో ఈపత్రిక, ప్రజలలో, అధికారులలో విశేష స్పందన తో దూసుకెళ్తుందని తెలిపారు. విజయం పత్రిక అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ముందుకు వెళ్తుందని అన్నారు. ప్రజలు, పాఠకులు విజయం పత్రికను ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు దయాకర్ రెడ్డి, బజ్జూరివెంకట్ రెడ్డి, బారీ శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి, బారీ వీరభద్రం, విజయం పత్రిక నెట్ వర్క్ ఇన్ చార్జ్ ఉల్లోజు వేణు, డిస్కె ఇన్ చార్జ్ నాగరాజు, విలేకర్లు క్రిష్ణారావు, శివనాగిరెడ్డి, విజయ్, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.