Telugu News

సుడా చైర్మన్ పై అసత్య ఆరోపణలు తగదు

★ రియల్ వ్యాపారులకు "సుడా"నే అభయం

0

సుడా చైర్మన్ పై అసత్య ఆరోపణలు తగదు
★ రియల్ వ్యాపారులకు “సుడా”నే అభయం
★ విలేకర్ల సమావేశంలో ఖమ్మం క్రెడాయ్‌ అధ్యక్షుడు కొప్పుల నరేష్
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఖమ్మం స్థంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ అక్రమాలకు పాల్పడుతూ రియల్ వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కొందరు చేసిన ఆరోపణలు అవాస్తవమని, ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేయడం తగదని ఖమ్మం క్రెడాయ్‌ అధ్యక్షుడు కొప్పుల నరేష్ హితవు పలికారు. ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్ లో శనివారం పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

also read :-సుడాలో అక్రమాలు అవాస్తవం : సుడా చైర్మన్

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మార్గనిర్దేశంలో సుడా ఏర్పడిన తర్వాత డీటీసిపీ లే ఔట్ లకు అనుమతులు, తదితర సదుపాయాలు వేగంగా సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. నగరం, జిల్లాలోని వ్యాపారులకు సుడా అభయం వంటిదన్నారు. వెంచర్ల అనుమతులకు సుడా చైర్మన్ విజయ్ కుమార్ అక్రమ వసులకు పాల్పడుతున్నారని ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి పరిస్థితి ఎలాంటిది లేదని తీవ్రంగా ఖండించారు. గతంలో సుడా ఏర్పడక ముందు రియల్ వ్యాపారులు ఎదుర్కొన్న ఇబ్బందులు ప్రస్తుతం లేవని వెల్లడించారు.