Telugu News

ఖమ్మంలో మణిహారంగా సుడా పార్క్

11న  ప్రారంభించనున్న మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్

0

మణిహారంగా సుడా పార్క్

== ప్రజలను అకట్టుకుంటున్న పలు రకాల బొమ్మలు

== రూ.2కోట్లతో నిర్మాణం

== ప్రారంభోత్సవానికి  సర్వం సిద్ధం

==11న  ప్రారంభించనున్న మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్

== సుడా పార్క్ లో అధికారులతో కలిసి పర్యటించిన ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్.

ఖమ్మం ప్రతినిధి,జూన్ 8(విజయంన్యూస్)

అందమైన అకృతి.. అద్భుతమైన నిర్మాణం.. హాయినిగొలిపే చల్లని వాతావరణం.. సేదతీరేందుకు అనువైన ప్రాంతం.. అలాంటి అద్భుతమైన పార్క్ ను నిర్మాణం చేసింది స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఖమ్మం.. రాష్ట్రంలో ఆదర్శంగా అభివృద్ధి సాధిస్తున్న రఘునాధపాలెం మండలంలోని ఇది ఒక మరో మణిహారం అనిచెప్పవచ్చు.. రాష్ట్రంలోనే తొలి బృహత్తర పల్లె ప్రకృతి వనం (ఖమ్మం సుడా పార్క్) సొంతం కానుంది. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ తరహాలో ఖమ్మం వెలుగుమట్ల పార్క్ ప్రసిద్ధి అయితే తెలంగాణ ప్రభుత్వం బృహత్తర పల్లె ప్రకృతి పథకాన్ని తీసుకొచ్చింది. కలుషితమవుతున్న వాతావరణాన్ని, నాశనమవుతున్న ప్రకృతిని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. కాగా గ్రామగ్రామాన ఈ పథకం అమలు అవుతుండగా, అనేక గ్రామాల్లో ప్రకృతివనాలను అద్భుతంగా తీర్చిదద్దేందుకు ఏర్పాట్లు చేస్తోంది.  ఈ నేపథ్యంలో స్థంభాద్రి అర్భన్ డెవలఫ్ మెంట్ అథారటీ ఖమ్మం ఆధ్వర్యంలో ఒక ప్రకృతివనాన్ని నిర్మాణం చేసేందుకు తలపించారు. సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ పర్యవేక్షణలో రఘునాధపాలెం  మండలంలో 14 ఎకరాల్లో సుడా పార్క్ పేరుతో బృహత్ పల్లె ప్రకృతి వనంను నిర్మాణం చేశారు. సుమారు రూ.2కోట్ల నిధులను ఖర్చు చేసిన సుడా, అందమైన అకృతి కల్గిన అభివృద్ధి చేశారు.

allso read – పార పట్టి.. రోడ్డు పై డామర్ వేసిన మంత్రి పువ్వాడ

== అకట్టుకుంటున్న పార్క్ 

ఖమ్మం నగరానికి అత్యంత చెరువలో ఖమ్మం – ఇల్లందు ప్రధాన రహదారి పక్కనే ఈ పార్కు ఉండటంతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.6 ఎకరాల్లో ట్యాంక్ బండ్,8 ఎకరాల్లో ప్లాంటేషన్,పర్యావరణాన్ని కాపాడేందుకు 23 వేల మొక్కలు సుగంధాన్ని వేదజల్లే అనేక రకాల పూల మొక్కలు ఏర్పాటు చేశారు. వివిధ ఆకృతుల్లో చెట్లు,పిల్లలు ఆడుకునేందుకు చిల్డ్రన్ పార్క్, పెద్దల ఫిట్నెస్ కోసం వాకింగ్ ట్రాక్ ఓపెన్ జిమ్ వంటి ఈ అందాల చూడతరమా అనిపించే బ్యూటిఫికేషన్ ప్లాంటేషన్,వాటర్ ఫౌంటెన్లు ఇలా ఎన్నో ప్రజలకు ఆనందాన్ని కలిగించే అంశాలు ఈ  పార్క్ సొంతం చేసుకుంది.సుడా ద్వారా 1.5 కోట్లు నిధులు,ఎనర్జీ ఎస్ ద్వారా రూ.36 లక్షలు రఘునాధపాలెం గ్రామపంచాయతీ ద్వారా రూ.20 లక్షలు వెచ్చించారు.

== 11న ప్రారంభించనున్న మంత్రులు

సుడా ఆధ్వర్యంలో నిర్మాణం చేసిన  సుడా పార్క్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్దమైంది. అన్ని అంగులతో, అకట్టుకునే పార్కును తయారు చేయగా, ఆ పార్కును మంత్రి కేటీఆర్ చేతుల మీదగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఇటీవలే ఆ పార్కును మంత్రి కేటీఆర్ చేతుల మీదగా ప్రారంభించాల్సి ఉండగా ఆపర్యటన వాయిదా పడింది. కాగా  జూన్ 11 న మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ఈ పార్కును ప్రారంభించనున్నారు. అందుకు గాను అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

 

 

== పార్కుల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి : సుడా చైర్మన్     

ప్రస్తుతం సమాజం స్పీడ్ యుగానికి వెళ్లింది.. ప్రకృతిని నాశనం చేస్తూ, పంటల కోసం, ప్లాట్ల కోసం చెట్లను నరికివేస్తూ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. తద్వారా మనుషుల అయూషు రోజురోజుకు తగ్గిపోతుంది. అందుకే పడిపోతున్న కాలుష్యాన్ని, నాశనమవుతున్న ప్రకృతిని కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గ్రామపంచాయతీలో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు చేశారు.  మండల కేంద్రానికి బృహత్తర పల్లె ప్రకృతి వనం, మండల ప్రజలు సేదతీరేందుకు టూరిజం పార్కుల అభివృద్ధి చేపట్టారు.  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  ప్రత్యేక చొరవతో 14 ఎకరాల్లో  రఘునాథపాలెం మండల కేంద్రంలో ఈ సుడా పార్కును అత్యంత సుందరంగా తీర్చిదిద్దాము.  రాష్ట్రంలోనే తొలిసారిగా మన దగ్గరే ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. జూన్ 11 న మంత్రులు కేటీఆర్,పువ్వాడ అజయ్ కుమార్  చేత ప్రారంభం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

== సుడా పార్క్ ను పరిశీలించిన సుడా చైర్మన్ 

రఘునాథపాలెం మండల కేంద్రంలో సుడా ఆధ్వర్యంలో నిర్మాణం చేసిన సుడా పార్క్ ను బుధవారం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, అధికారులు పరిశీలించారు. జూన్ 11న మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభిస్తున్న సందర్భంగా అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడ ఇబ్బందులు కల్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో

అధికారులు రఘునాధపాలెం మండల ఎం.పీ.డీ.వో రామకృష్ణ, అడిషనల్ పిడి,పంచాయతీ రాజ్ ఏ.ఈ ఆదిత్య రాజ్,పంచాయతీ సెక్రెటరీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు…