Telugu News

సుడా లో పరేషాన్..?

== అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కథనాలు..

0

సుడా లో పరేషాన్..?
అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కథనాలు..
 హాడాహుడిగా విలేకర్ల సమావేశాలు..
అక్రమాలు నిజమేనా..? ప్రచారమా..?
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
స్థంబాద్రి అర్భన్ డెవలఫ్ మెంట్ అథారిటి(సుడా)లో అక్రమాలు జరుగుతున్నాయా..? పైసలు ఇవ్వందే పైలు కదలడం లేదా…? రియల్టర్లను బెదిరింపులకు గురి చేస్తున్నారు..? వార్త పత్రికల్లో వస్తున్న కథనాలు నిజమేనా..? అత్యవసరంగా సుడా చైర్మన్ ప్రెస్ మీట్, రియల్టర్ల ప్రెస్ మీట్ ఎందుకు..? ఖమ్మం సుడా లో ఎం జరుగుతోంది..? పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా అత్యధికంగా రెవెన్యూ కల్గిన ఏకైక ప్రభుత్వ సంస్థ స్థంబాద్రి అర్భన్ డెవలఫ్ మెంట్ అథారటీ(సుడా). గతంలో సుడా లేకపోయినప్పటికి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత ఖమ్మంలో స్థంబాద్రి అర్భన్ డెవలఫ్ మెంట్ అథారటీని ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాలో ఐదు నియోజవర్గాలు ఉంటే సుడాలోకి నాలుగు నియోజకవర్గాలలోని పలు గ్రామాలను తీసుకున్నారు. ఖమ్మం నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలన్ని ఈ సుడా పరిధిలోకి వచ్చేటట్లుగా ప్రభుత్వం హద్దులను నియమించింది.

also read ::-సకల హంగులతో ఖమ్మం కార్పోరేషన్ భవన నిర్మాణం : మంత్రి పువ్వాడ

అయితే మొదటి ప్రభుత్వం హాయంలో చాలా తేలికగా తీసుకున్నప్పటికి రెండవ సారి టీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో సుడా పరిధిలను పటిష్టం చేశారు. ఈ సుడాకు చైర్మన్ గా బచ్చు విజయ్ కుమార్ ను నియమించిన అనంతరం పెద్ద ఎత్తున కఠిన నియమనిబంధనలను అమలు చేశారు. సుడా పరిధిలో ఉన్న గ్రామాల్లో, నగరంలో వెంచర్లు వేయాలన్న, బిల్డింగ్ లను నిర్మాణం చేయాలన్న కచ్చితంగా సుడా అనుమతి తప్పని సరిగా నిబంధనలను కఠినతరం చేశారు. దీంతో రియల్టర్ లు ఒకింత ఇబ్బంది పడినప్పటికి సుడా అధికారులతో పాటు కలెక్టర్ వి.పి.గౌతమ్ పెద్ద ఎత్తున్న అనుమతులను కఠినతరం చేశారు.దీంతో అక్రమ లేఆవుట్ల సంగతిని తెల్చే పనిలో పడ్డ సుడా అధికారులు అనుమతులు లేని వెంచర్లపై చర్యలు తీసుకున్నారు.

also read :-ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు

అనుమతులు లేవంటూ ప్రత్యేకంగా బోర్డులను పెట్టారు. వెంచర్లకు వేసిన రాళ్లను, నిర్మాణాలను తొలగించారు. అలాగే జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అక్రమ వెంచర్లు, అక్రమ భవన నిర్మాణాలపై నిఘా పెట్టారు. కొన్ని మండలాల్లో సుడా ఫరిధిలో ఉన్న వెంచర్లను అకస్మీకంగా తనిఖీలు చేసి వాటి నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో సుడా పరిధిలో వేసిన వెంచర్ల యజమాన్యాలు, రియల్ వ్యాపారులు సుడాకు అనుమతి కోసం దరకాస్తులు చేసుకున్నారు. కాగా సుడాకు మరింతగా అధాయం పెరిగింది. ఎవరు ఊహించనంతా ఆధాయవనరులు వచ్చాయని స్వయంగా సుడా అధికారులు గతంలో ప్రకటించిన పరిస్థితి ఉంది. సుడా నిధులతో అభివద్ధి పనులు కూడా చేపట్టిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే మరీ ఆరోపణలేందుకు…?
== చేయ్యితడపందే పైల్ కదలదంటా..?
సుడా పరిధిలో రియల్ వ్యాపారం చేయలంటే కచ్చితంగా సుడా చైర్మన్ తో పాటు కార్యాలయంలో పైసల్ ఇవ్వందే పని కాదంటూ కొంత మంది ఆరోపణలు చేస్తున్నారు. పైసలు ఇచ్చినవారి ఫైల్ త్వరగా మూవ్ అవుతుంటే, పైసల్ ఇవ్వని వారి దరఖాస్తులు ఒక మూలన మూలుగుతుంటాయని పలువురు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా నేరుగా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగి వారి మనుషుల ద్వారా ’పైసా వసూల్‘ నడిపిస్తున్నట్లు బయట బహిరంగంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. ఈ విషయమే గత రెండు రోజులుగా వివిధ పత్రికల్లో కథనాలు ప్రచురితమవుతున్నాయి. దీంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సుడాలో పరేషన్ నేలకొనట్లు తెలుస్తోంది. రాజకీయంగా కలకలం రేపిందనే చెప్పాలి. ఎందుకుంటే సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు అత్యంత సన్నిహితుడిగా మెలుగుతున్నారు. ఈ క్రమంలో ఆయనపై మీడియాలో వరస కథనాలు వస్తుండటంతో అది కాస్త సంచలనమైంది.
== ఖండిస్తూ ప్రెస్ మీట్లు
సుడాలో అక్రమాలు అంటూ మీడియాల వస్తున్న కథనాలకు సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, అలాగే కొంత మంది రియల్ వ్యాపారులు అత్యవసరంగా ప్రెస్ మీట్లు పెట్టి ఖండించారు. సుడాలో ప్రభుత్వ నియమనిబందనలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయని, ఎక్కడ అవినీతి జరిగే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే మీడియాలో వచ్చిన కథనాలకు రియల్ ఎస్టైట్స్ యజమానులు ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. చైర్మన్ పై అరోపణలు వచ్చినప్పుడు ఆయన స్పందించి ప్రెస్ మీట్ పెట్టడం లేదంటే, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆయన అభిమానులు ప్రెస్ మీట్ పెట్టి ఉంటే అంతగా చర్చాంశనీయమయ్యేది కాదని, కానీ రియల్ ఎస్టైట్స్ వారు ప్రెస్ మీట్ పెట్టి చైర్మన్ అవినీతికి పాల్పడటం లేదని చెప్పడం మాత్రం కచ్చితంగా ఏదో మతలబు ఉన్నట్లేనని పలువురు సీనియర్ జర్నలిస్టులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరీ సుడాలో అక్రమాలు జరుగుతున్నాయా..? లేదా..? అనే విషయాలను మాత్రం జిల్లా కలెక్టర్ లేదంటే జిల్లా అధికారులు స్పందించి విచారణ చేస్తే బాగుంటుందని పలువురు నగర ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో..? వేచి చూడాల్సిందే..?