Telugu News

సుడాలో అక్రమాలు అవాస్తవం : సుడా చైర్మన్

వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తున్నానని చెప్పడం హాస్యాస్పదం

0

సుడాలో అక్రమాలు అవాస్తవం : సుడా చైర్మన్
వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తున్నానని చెప్పడం హాస్యాస్పదం
మంత్రి అజయ్ ఆదేశాల మేరకే సుడా నిధులతో అభివద్ధి పనులు చేస్తున్నాం
 ఇప్పటి వరకు రూ.13కోట్లతో అభివద్ధి పనులు చేశాం
అక్రమ వెంచర్లకు అనమతులు ఇవ్వలేదు
రాజకీయంగా ఎదుర్కోలేకనే అబద్దపు ప్రచారం
విలేకర్ల సమావేశంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్);-

ఖమ్మం స్థంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) పరిధిలో అక్రమాలు జరిగాయనే అసత్య ఆరోపణల్లో వాస్తవం లేదని చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలోని సుడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తున్నానని పత్రికల్లో కొందరు చేసిన ఆరోపణలు అవాస్తవమని, ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు సుడా నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామే కానీ మరేవిధమైన అక్రమాలకు తావులేదని, అలా చేశానని రుజువు చేస్తే ఎంతటి శిక్షకైనా సిద్ధమేనని తెలిపారు. గత రెండు రోజులు క్రితం మంత్రితో కలిసి కార్పొరేషన్ కార్యాలయ నిర్మాణ పనుల పరిశీలన, కళ్యాణ లక్ష్మి, షాద ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో తను పాల్గొన్నానని చెప్పారు. 2020 జూన్ 11వ తేదీన మంత్రి పువ్వాడ ఆశీస్సులతో బీసీ సామాజిక వర్గానికి చెందిన తనకు సుడా చైర్మన్ గా అవకాశం కల్పించారని, మంత్రికి, తెరాస పార్టీకి క్రమశిక్షణతో మంచిపేరు తెచ్చే ప్రయత్నం చేశానన్నారు.

also read :-సుడా లో పరేషాన్..?

సుడా నిబంధనల ప్రకారం వెంచర్లకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందని, ఇప్పటి వరకు ఎలాంటి అక్రమ వెంచర్లకు అనుమతులు ఇవ్వలేదన్నారు. సుడా ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు రూ. 13 కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. రఘునాధపాలెం నుండి మంచుకొండ వరకు ఒక కోటి రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టామని, వివి పాలెం మరియు మంచుకొండ గ్రామాలలో 2 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. బల్లెపల్లి నుండి రఘునాథపాలెం వరకు డివైడర్ సెంట్రల్ లైటింగ్ కొరకు కోటి 80 లక్షలు ఖర్చు చేశామన్నారు. జీవో నెంబర్ 33 ప్రకారం వెంచర్లు ఏర్పాటు చేసి డీటీసీపీ అప్రూవల్ తీసుకోవాలని తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అక్రమ వెంచర్లుకు అనుమతులు మంజూరు చేసేది లేదన్నారు. 1977 నుండి ఇప్పటివరకు సుడా పరిధిలోని అనేక గ్రామాలలో గ్రామ పంచాయతీ అనుమతి తో వెంచర్లు ఏర్పాటు చేశారని, దాదాపు 600 వెంచర్లు ఉన్నాయని వీటిలో 50 వరకు అక్రమ వెంచర్లు ఉన్నాయన్నారు. 2020 జూన్ నుండి ఈనెల 1వ తేదీ వరకు 43 వెంచర్లు డీటీసీపీ అప్రూవల్ పొందాయన్నారు. ఖమ్మం లో రాజకీయంగా తెరాసను ఎదుర్కోలేక కొందరు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

also read :-విష‌మంగా ల‌తా మంగేష్క‌ర్ ఆరోగ్యం

అక్రమ వెంచర్లు క్రమబద్దీకరించడం వలన ప్లాట్లు కొనుగోలు చేసే ప్రజలకు ఇబ్బందులు ఉండవద్దని ఉద్దేశంతోనే ప్రభుత్వం జీవో నెంబర్ 33 తీసుకు వచ్చిందన్నారు. దీని ద్వారా రోడ్లు, పార్కులు, డ్రైనేజీ ,విద్యుత్ లాంటి సౌకర్యాలు ప్రజలకు అందుతున్నాయని వెల్లడించారు. అక్రమ వెంచర్లు నిర్మాణం చేసి కోట్లకు పడగలెత్తిన పలువురు బడా వ్యాపారులు సుడా పాలకవర్గాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విలేకరుల సమావేశంలో సుడా పాలకవర్గ సభ్యులు కోసూరి రమేష్ గౌడ్, యండి.ఖాదర్ బాబా, షేక్ ముక్తార్, కొల్లు పద్మ, మాటూరి లక్ష్మీనారాయణ, దేవభక్తిని కిషోర్ బాబు, దొంగల తిరుపతిరావు, చల్ల అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు