Telugu News

సూదిగాళ్ళు చిక్కారా..?

ముగ్గురు నిందితులుగా గుర్తించిన పోలీసులు

0

సూదిగాళ్ళు చిక్కారా..?

== ముగ్గురు నిందితులుగా గుర్తించిన పోలీసులు

== పట్టుకునేందుకు నాలుగు బృందాలు

== నరిశెట్టి వెంకటేష్, మోహన్ రావు, ఆర్ఎంపీ బండి వెంకట్ గా గుర్తింపు

== అక్రమసంబంధమే హత్యకు కారణం..?

==  సంచలనం కల్గించిన సూదిమందుతో హత్యకేసులో పోలీసుల పురోగతి…

== పరారీలో బండి వెంకట్..?

(ముదిగొండ/ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)

సూదిగాళ్లు చిక్కారు.. అత్యంత విచిత్రకరంగా హత్య చేసిన నిందితులను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.. మొదటిగా ఇద్దరు నిందితులని భావించినప్పటికి హత్య చేసింది ముగ్గురుగా పోలీసులు నిర్థారించారు.. అందులో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరోకరు పరారిలో ఉన్నట్లు తెలుస్తోంది.. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..

alls0 read- టీమీండియా 208 రన్స్ తో భారీస్కోర్

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం, వల్లభిలో లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిని ఇంజక్షన్ తో హత్య చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఖమ్మం జిల్లా, మధిర నియోజకవర్గం, చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్(55) తన కూతుర్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గండ్రాయి గ్రామానికి ఇవ్వగా, ఆయన తన మోటర్ సైకిల్ పై వల్లబి మీదగా గండ్రాయి వెళ్తున్నాడు. మార్గం మధ్యలోని బాణాపురం- వల్లభి మధ్యలో గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ ఇవ్వమని అడగ్గా,  మోటర్ సైకిల్ ఆపి ఎక్కించుకున్నాడు. అప్పటికే మాస్క్ ధరించి గుర్తు పట్టని విధంగా క్యాఫ్ పెట్టుకున్న ఆ గుర్తు తెలియని నిందితుడు బాణాపురం దాటి తరువాత వల్లభి పొలాల సమీపంలో మోటర్ సైకిల్ పై ఉన్నఆ వ్యక్తి జమాల్ సాహెబ్ కు  వెనక నుంచి ఇంజక్షన్ ఇచ్చి మోటర్ సైకిల్ దిగి పరారైనట్లుగా పలువురు స్థానికులు తెలిపారు. దీంతో జమాల్ సాహెబ్ అక్కడిక్కడే చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్నఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి, సీఐ శ్రీనివాస్ రావు, ఎస్ఐ నాగరాజు సంఘటన స్థలానికి చేరుకుని ధర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్య ఎలా జరిగింది..? ఎందుకు జరిగిందనే విషయాలపై ప్రజలు, పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఆయన సంబంధికులు హత్య చేశారా..? ప్రోఫిషనల్ కిల్లర్స్ హత్య చేశారా..? సైకో హత్య చేశారా..? అనే విషయంపై ఆరా తీసిన పోలీసులు హత్యకు సంబంధించిన కొన్ని వివరాలను సేకరించి నాలుగు బ్రుందాలను రంగంలోకి దింపారు. ఇక అంతే సంగతి..?

allso  read- పిల్లల ప్రాణాలతో చెలగాటం..!

== హత్య కేసులో ముగ్గురు నిందితులు..?

వల్లభిలో జరిగిన హత్య కేసులో పురోగతి లభించింది. నాలుగు బృందాలుగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా, నిందితులను గుర్తించినట్లు తెలుస్తోంది. చింతకాని మండలం, నామారం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మోహన్ రావు, ట్రాక్టర్ డ్రైవర్ నరిశెట్టి వెంకటేష్ లు హత్యకు కుట్రపన్నినట్లుగా తెలుస్తోంది.. అయితే అందుకు ఖమ్మంలో ఆర్ఎంపీగా పనిచేస్తున్న బండి వెంకటేశ్వర్లు అనే అతను ఇంజక్షన్ తీసుకొచ్చి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు వీరు ముగ్గురు నిందితులుగా తెల్చినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే అందులో మోహన్ రావు, వెంకటేష్ ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికి అందులో ఎంత నిజం ఉన్నదనేది పోలీసులు చెప్పాల్సి ఉంది..  బండి వెంకటేశ్వర్లు పరారిలో ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు పోలీసులు అధికారికంగా ద్రువీకరించలేదు.

== అక్రమ సంబంధమే హత్యకు కారణమా..?

జమేల్ సాహెబ్ హత్యకు ప్రధాన కారణం అక్రమ సంబంధమేనని పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం. ఆ దిశగా విచారణ చేపట్టిన పోలీసులు నింధితులను పట్టుకోవడానికి మార్గం సులువైనట్లు తెలుస్తోంది.. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే ఆలోచనతో హత్య చేసినట్లు తెలుస్తోంది.. అయితే పోలీసులు పూర్తి వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది..

allso read- ప్రమాద ఘంటికలు మోగిస్తున్న వెంగళ రావు సాగర్ ప్రాజెక్ట్