Telugu News

కుటుంబ కలహాలతో ఉరివేసుకుని ఆత్మహత్య……

కొన్నాళ్లుగా మద్యానికి బానిస.....

0

కుటుంబ కలహాలతో ఉరివేసుకుని ఆత్మహత్య……
కొన్నాళ్లుగా మద్యానికి బానిస…..
(చండ్రుగొండ -విజయ0 న్యూస్ ):-

ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి… అయ్యన్నపాలెం గ్రామానికి చెందిన కాకటి నాగరాజు(28) ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. గత కొన్నేళ్లుగా మద్యానికి బానిసైన నాగరాజు కుటుంబంలో కలహాలు చోటు చేసుకునేవి. ఈ గ్రామంలో బుధవారం రాత్రి సైతం మద్యం సేవించిన నాగరాజు భార్యతో గొడవ పడి ఇంటి నుండి బయటికి వెళ్లాడు. గురువారం ఉదయం గ్రామ పక్కనే ఉన్న మామిడి తోట లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గ్రామస్తులు గమనించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ బి రాజేష్ కుమార్ సంఘటన స్థలాన్ని సందర్శించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య,ఇద్దరు సంతానం కలదు.

also read ;-ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే౼ మంత్రి పువ్వాడ.