ఆత్మహత్యలు లేని తెలంగాణ కాంగ్రెస్ లక్ష్యం: భట్టి విక్రమార్క
చేనేత సమస్యలపై దీక్ష చేస్తున్న కార్మికుల పోరాటానికి భట్టి మద్దతు
ఆత్మహత్యలు లేని తెలంగాణ కాంగ్రెస్ లక్ష్యం: భట్టి విక్రమార్క
==ఇందిరమ్మ రాజ్యంలో చేనేతరంగానికి పెద్దపీట
== చేనేత కార్మికుల ఆత్మహత్యలకు పాలకులు తలదించుకోవాలి
== చేనేత సమస్యలపై దీక్ష చేస్తున్న కార్మికుల పోరాటానికి భట్టి మద్దతు
== జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు సిఎల్పీ నేత భట్టి సంఘీభావం
== 51వ రోజు పోచంపల్లిలో కొనసాగిన పాదయాత్ర
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఆత్మహత్యలు లేనటువంటి చేనేత కార్మికుల జీవితాలను చూడటమే కాంగ్రెస్ లక్ష్యంగా రానున్న ఇందిరమ్మ రాజ్యంలో చేనేత రంగానికి పెద్ద పీట వేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.భూదాన్ పోచంపల్లి మండలంలో కేంద్రంలో చేనేత సహకార సొసైటీ కార్యాలయం ఎదురుగా చేనేత సమస్యలపై దీక్ష చేస్తున్న కార్మికుల పోరాటానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా శనివారం సంఘీభావం ప్రకటించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఇది కూడా చదవండి: నయీం డైరీ ఏమైంది?: భట్టి
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ధనిక రాష్ట్రంలో చేనేత రంగాన్ని మరింత ఎక్కువగా ప్రోత్సహించడానికి ఇవ్వాల్సిన సబ్సిడీ రాయితీలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం జియో విధానం తీసుకువచ్చి అనేక కొర్రీలు పెట్టడం దుర్మార్గమని జియో టాకింగ్ పేరుతో రాష్ట్రంలో కేవలం 17 లక్షల మంది చేనేత కార్మికులు మాత్రమే ఉన్నారని తక్కువ చూపించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నదని మండిపడ్డారు. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో చేనేత కార్మికులకు 350 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ కు ఉన్నదన్నారు. రాష్ట్రంలో నేత కార్మికులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి తీసుకువచ్చిన పాలకులు తలదించుకోవాలన్నారు. చేనేత ఆకలి చావులు వారి సమస్య కాదని అది సామాజిక సమస్యగా గుర్తించాలన్నారు. చేనేత రంగాన్ని ఆదుకోకుంటే సమాజానికి పెద్ద నష్టమని భావించిన స్వర్గీయ వైయస్సార్ అనేక సబ్సిడీలు రైతులు తీసుకొచ్చారని వెల్లడించారు. చేనేతరంగాన్ని వ్యాపార కోణంతో చూడకుండా నాగరికత అంశంగా ప్రభుత్వం గుర్తించి వారికి అందివ్వాల్సిన రాయితీలు, ప్రోత్సాహాలు జాప్యం జరగకుండా ఇవ్వాలన్నారు. చేనేత నూలుపై కేంద్ర ప్రభుత్వం విధించే జిఎస్టి 18%, రాష్ట్ర ప్రభుత్వ విధించే నాలుగు శాతం పన్నులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బీసీ సప్లై చట్టం తీసుకొస్తే నేత కార్మికులకు సమగ్రమైన నిధులు వస్తాయని, పరిహారం కోసం పదిలక్షలు ఇవ్వాలని కోరుతున్న చేనేత కార్మికుల కోరిక చాలా చిన్నదిగా ఉంటుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం చేనేత నూలుపై ఇచ్చే సబ్సిడీ సక్రమంగా ఇవ్వడం లేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మూడు నెలలకు ఒకసారి అందిస్తామని వెల్లడించారు. మరమగాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని కోరుతున్న నేత కార్మికుల కోరికను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పోచంపల్లి మండల కేంద్రంలో ఆత్మహత్య చేసుకున్న 10 మంది చేనేత ఏమీ లేదు కార్మికుల కుటుంబాలకు ఇచ్చే పరిహారం మూడేళ్లు ఇవ్వకుండా ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యంపై మండి పడ్డారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీ లక్ష్య సాధకడు విక్రమార్కుడు: జావిద్
బాయిత కుటుంబాలకు తక్షణమే పరిహారం విడుదల చేయాలని సమావేశంలో త అధికారులతో మాట్లాడుతానని వారికి భరోసా ఇచ్చారు. రైతు భీమా తరహా లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేనేత బీమా పథకం తీసుకొస్తామని వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి రావలసిన సబ్సిడీ సకాలంలో ఇవ్వడం లేదని అడిగినందుకు చేనేత సొసైటీ పాలకవర్గ సభ్యులపై పెట్టినటువంటి అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయకపోతే ఆరు నెలల్లో వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని కేసు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. సహకార సంఘం ఎన్నికలు జరపకుండా ప్రభుత్వ అప్రజా సామికంగా వ్యవహరించడం తగదని వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న పదిమంది చేనేత కుటుంబాలకు అందాల్సిన పరిహారం ప్రభుత్వం మూడేళ్లుగా విడుదల చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. పదిమంది బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 వేల చొప్పున తాను ఆర్థిక సాయం అందిస్తానని ప్రకటించి వారికి ఓదార్పు కలిగించారు.
== కనీస వేతన చట్టం అమలు చేయకపోవడం పెద్ద నేరం
పార్లమెంట్లో చేసిన చట్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకపోవడం పెద్ద నేరంగా భావించాలని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు రెగ్యులర్ చేయాలని భూదాన్ పోచంపల్లి మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో శాంతియుతంగా నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శిలు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ
ఇదికూడా చదవండి: ఇది దున్నపోతు ప్రభుత్వం : భట్టి విక్రమార్క
జూనియర్ పంచాయతీ కార్యదర్శులతోపాటు ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు, కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులను కూడా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సమ్మె చేస్తున్న పంచాయతీ కార్యదర్శుల డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి లేఖ రాస్తానని వెల్లడించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కనీస వేతనం నిర్ణయం పై సమీక్షలు జరపడం లేదని అన్నారు. సమీక్షలు జరగకపోవడం వల్ల పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం నిర్ణయం కాకపోవడంతో కార్మికులు ఉద్యోగులు నష్టపోతున్నారని దీనికి ప్రభుత్వం కావాలని చేస్తున్న కుట్రలో భాగమేనని పేర్కొన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయకుంటే ఐదు నెలల తర్వాత అధికారంలోకి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులను, అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను, కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: 500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న భట్టి పాదయాత్ర
పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పోచంపల్లిలో 51వ రోజు కొనసాగింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేనేత సమస్యలపై చేసిన దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపి వారి పోరాటానికి మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత చేనేత కార్మికుడు వేముల శ్యామ్ ఇంటికి వెళ్లి చీరలను నేయడం కోసం చేనేత కార్మికులు పడుతున్న శ్రమ, చేనేత మగ్గాలు, చీరలు వేసే విధానాన్ని ప్రత్యక్షంగా నేస్తు పరిశీలించారు. ఒక చీర తయారు కావడానికి ఎంతమంది పనిచేస్తారని ఎన్ని రోజులు పడుతుందని అడిగి వారిని తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి అందుతున్న రాయితీలు ప్రోత్సాహకల గురించి ఆరా తీశారు. ఆ తర్వాత శ్యామ్ ఇంట్లో మూడు చీరలను ప్రియాంక గాంధీ కి బహుకరణ చేయడానికి ఖరీదు చేశారు. ఆ తర్వాత సూరపల్లి రాము నేత కార్మికుడు పాదయాత్రకు ఎదురుగా వచ్చి తాను నేస్తున్న ఇక్కత్ చీరలను చూడాలని భట్టి విక్రమార్కను ఆయన ఇంట్లోకి తీసుకువెళ్లి చూపించారు. చీరలు తయారు చేయడానికి నూలుకు ఇచ్చే సబ్సిడీ రాయితీలు రావడంలేదని కేంద్ర ప్రభుత్వం 18 శాతం జీఎస్టీ విధిస్తే, రాష్ట్ర ప్రభుత్వం నాలుగు శాతం పన్నులు వేస్తున్నదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి పన్నులు వేయకుండా ప్రత్యేక రాయితీలు ఇచ్చారని గుర్తు చేశారు. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే తిరిగి మా బతుకులు బాగుపడతాయని, ఇందుకు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించుకుంటామని అన్నారు. ఆ తర్వాత కొబ్బరి బోండాలు అమ్ముతున్న భారతమును గెలిచి ప్రభుత్వం ఇల్లు ఇచ్చిందా అని అడిగారు. తనకు ఇల్లు రాలేదని ఇంట్లో చదువుకున్న కొడుకుకి కొలువు కూడా రాకపోవడంతో గడ్డాలు పెంచుకొని రోడ్డుమీద తిరుగుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కొబ్బరి బోండాలు అమ్ముకున్న డబ్బులతో కుటుంబాన్ని సాకుతున్నాని, తమకు ఏమైనా సాయం చేయించాలని వేడుకున్నది. ఆ తర్వాత ఎంపీడీవో కార్యాలయం వద్ద సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. పోచంపల్లి నుంచి బాటసింగారం వరకు కొనసాగిన పాదయాత్రకు జనం నీరాజనం పలికారు. దారి పొడవున సమస్యలు ఆలకిస్తూ పాదయాత్ర కొనసాగించారు.
ఇది కూడా చదవండి: పొంగులేటి కాంగ్రెస్ కు రండీ..:భట్టి
జలాల్పురం గ్రామం సర్వేనెంబర్ 80లో 90 ఎకరాల భూమిని వంద సంవత్సరాల నుంచి సేద్యం చేసుకుంటున్నా వారికి పట్టాలు ఇవ్వకుండా ఇంగ్లీష్ మరియు ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ కి అలైనేషన్ చేశారని గ్రామస్తులు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు గోడు వెల్లబోసుకున్నారు. రెవిన్యూ రికార్డులో అటవీ భూమి గా నమోదై ఉందని చెప్పి పట్టాలు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులు పెట్టగా నల్లగొండ కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా ఆ తర్వాత కొలతలు చేయించి పోరంబోకు భూమిగా సేత్వాల్లో ఉన్నదని రికార్డు ఇచ్చారు. రెవిన్యూ భూమి గా పరిగణించిన ప్రభుత్వం 100 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న రైతులకు కాకుండా ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ కి కేటాయించి తమకు అన్యాయం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వినతిపత్రం ఇచ్చినవారిలో బాధిత రైతులు ఉపేందర్ గౌడ్, పాలకూల రాజు, హరి ప్రసాద్ గౌడ్, కొయ్యడ లోకేష్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, ఈశ్వరయ్య, నరసింహ తదితరులు ఉన్నారు.