Telugu News

ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య

విజయం న్యూస్

0

ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య

(విజయం న్యూస్):-
తిర్యాణితిర్యాణి మండలంలోని మణిక్యాపూర్ గ్రామానికి చెందిన తుమరం నవీన్ (21) అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

also read;-గుర్తు తెలియని మహిళ మృతదేహం.

తిర్యాణి ఎస్సై సిహెచ్ రమేష్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు నవీన్ బుధవారం మధ్యాహ్నం అదే గ్రామానికి చెందిన ఓ యువతి ఫోన్ లో మాట్లాడుతుండగా ఆమె వద్దకు వెళ్లి తనను ప్రేమించాలని అనడంతో ఆమె నిరాకరించి కేకలు వేయడంతో మనస్తాపానికి గురై తాగిన మైకంలో మాణిక్యాపూర్ అడవి ప్రాంతంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుని తల్లి దురపతి బాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.