Telugu News

ఎవరీ భాస్కర్ రాజా రవీంద్ర..? 

కోటి గెలిచారా..? ఏం జరిగింది..?

0

ఎవరీ. భాస్కర్ రాజా రవీంద్ర..?

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్) :-

భాస్కర్ రాజా రవీంద్ర.. ఈ పేరు ఎప్పుడూ వినలేదు  కదా..* ఈ మధ్య ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తుంది.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అభినంధనలతో పాటు.. అతృత ఎక్కువైంది.. ఆయన కోటీ గెలుస్తాడా..? అనేది ఒక ఉత్కంఠ అయితే.. అసలు ఆయనేవరు..? అనే ఉత్కంఠ మరోకటి… ఇలా చాలా మంది ఆ పేరుతో వివరాల కోసం  నెటిజన్లు గుగూల్ లో సర్చ్ చేస్తున్నారు.. నిజంగా అసలు ఆయనేవరూ..? ఆయనను ఎందుకు సర్చ్ చేస్తున్నారు..? ఆయనకు అభినంధనలు ఎందుకు చెబుతున్నారో తెలుసుకోవారంటే ఈ స్టోరి చదవాల్సిందే..?

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాతనగర్ మండలంకు చెందినటువంటి. విశ్రాంత గ్రామీణ వికాస బ్యాంకు ఉద్యోగి  బి. వి ఎస్ ఎస్ రాజు, శేషుకుమారి దంపతుల  కుమారుడు “భాస్కర్ రాజా రవీంద్ర”.. ఆయన ధర్మపత్ని సింధుజ..కుమారుడు దేవాన్ష్ కార్తికేయ..కూతురు  కృతి అన్విక.. 1989 to 1997  వరకు మధు విద్యాలయం వైరా నందు ప్రాథమిక  విద్యాభ్యాసం చేసిన ఆయన 1999 to 2003   వజీర్ సుల్తాన్ ఇంజనీరింగ్ కాలేజీ నందు  బీటెక్ పూర్తి చేశారు. ఈ బీటెక్ ఎంఏ ఎల్.ఎల్.బి. చదివిన  రవీంద్ర  2012లో  పోలీస్ శాఖలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా  మంథని సర్కిల్. ముత్తారం పిఎస్ లో  సబ్ ఇన్స్పెక్టర్ గా విధులకు జాయిన్ అయ్యారు. తదుపరి 2015 నుంచి నేటి వరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో విధులు నిర్వహిస్తూ నేడు సి. ఐ.డి సైబర్ క్రైమ్  నందు విధులు నిర్వహిస్తూ ఉన్నాడు..మరో కోణంలో ఉద్యోగ బాధ్యతల రీత్యా పోలీస్ శాఖలో, 2015 నుంచి పిస్టల్,  రైఫిల్ కాంపిటేషన్ లో తెలంగాణ పోలీసు శాఖ నుంచి వివిధ కాంపిటేషన్ లో పాల్గొన్నారు.

2016లో  పుణె లో జరిగిన షూటింగ్ కాంపిటేషన్ నందు ఎయిర్ రైఫిల్ విభాగంలో  బ్రాంజ్ మెడల్ సాధించిన రాజా 2017 లో  గౌహతి లో జరిగిన షూటింగ్ కాంపిటేషన్ నందు ఎయిర్ రైఫిల్ విభాగంలో  గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది..2019లో  తెలంగాణ పోలీస్ శాఖ నుండి ఆలిండియా పోలీస్ పిస్టల్ కాంపిటీషన్ నందు సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. అంతేకాకుండా 2018 – 2019 చైనాలో జరిగిన వరల్డ్ పోలీస్ షూటింగ్ కాంపిటేషన్ లో పాల్గొన్న రాజాభవిష్యత్తులో భారతదేశం నుండి తెలంగాణ రాష్ట్రం నుండి ఒలంపిక్ పోటీల్లో పాల్గొని భారతదేశానికి ప్రపంచ పటంలో పతకాల పట్టికలో గర్వించే విధంగా ఉండాలని అనుకున్నాడు.

** కోటీశ్వరుడిగా..        ALSO READ :- గేదె పాలివ్వడం లేదంటూ పోలీసులను ఆశ్రయించిన రైతు.

ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యతగా జెమినీ టీవీలో “ఎవరు మీలో కోటీశ్వరుడు” కార్యక్రం కొనసాగుతుంది. ఎంతో మంది ఎంపికైన ఈ పోటీలో రవీంద్ర కూడా ఎంపికైయ్యాడు. కాగా గత మూడు రోజులుగా ఆయన హాట్ సీటుకు ఎంపిక కాగా ఎన్టీఆర్ అడుగుతున్న ప్రశ్నలన్నింటికి జవాబులిస్తూ అందర్ని అశ్చర్యపరుస్తున్నాడు. చాలా కఠినమైన ప్రశ్నలు కంప్యూటర్ అడుగుతున్నప్పటికి ఆలోవకగా సమాధానాలిస్తూ.. నవ్వుతూ.. నవ్విస్తూ కనిపిస్తున్నాడు. చివరికి ఆయన జనరల్ నాలెడ్జ్ కి యావత్తు దేశం పిధా అయ్యింది.. కాగా కోటి రూపాయల ప్రశ్న వద్ద అగిన షో.. సోమవారం ప్రారంభం కానుంది. అయితే జెమిని టీవీలో ఇస్తున్న ప్రకటన అధారంగా చూస్తే రవీంద్ర   విజేతగా నిలిచినట్లు కనిపిస్తోంది.. అయితే ఇక నెటిజన్లు మాత్రం మీలో ఎవరు కోటీశ్వరుడు.. కోటి రూపాయలు గెలుచుకున్న వ్యక్తి. అంటూ ప్రచారం చేస్తున్నారు. నిజంగా ఆయన కోటి గెలిచిన.. గెలవకపోయిన దేశ ప్రజల మనసులును మాత్రం కొట్టేశాడు.. రవీంద్ర.. షో యూవరే గ్రెట్ పర్శన్.. మా అందరికి అదర్శం.. నువ్వు రియల్ హీరోవి, మట్టిలో మాణిక్యం.. అంటూ నెటిజన్లూ పొగడ్తలతో ముంచేత్తుతంన్నారు.  చూద్దాం.. ఈ రోజు జరిగే లైవ్ షోలో ఏం జరగబోతుందో… విజయం పత్రిక కూడా అభినంధనలు..ఆల్ ది బెస్ట్ చెబుతోంది..

ALLSO READ :- జై భీమ్ ‘‘సినతల్లి’’ పేర బ్యాంకులో రూ.10లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన హీరో సూర్య.