Telugu News

సండే గుడ్ న్యూస్.. స్థిరంగా పెట్రోల్ ధరలు

0

దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్డీ జిల్ ధరలను పెంచలేదు.

విజయం డైలీ
గత 24 రోజులుగా పోట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతోంది. ప్రతి 15 రోజులకు మారాల్సిన పెట్రో ధరల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరలు పెరగక పోవడంతో సామాన్య జనం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్డీ జిల్ ధరలను పెంచలేదు. ఆదివారం తెలుగు రాష్ట్రాలలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్డీ జిల్ ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.83గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 97.96గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.71 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.97.83గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 105.89గా ఉండగా.. డీజిల్ ధర రూ. 97.99గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.83గా ఉండగా.. డీజిల్ ధర రూ.98.89గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.18ఉండగా.. డీజిల్ ధర రూ.98.29గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.38 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.53గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్డీ జిల్ ధరలు..
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.108.16 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.99.74 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.80 ఉండగా.. డీజిల్ ధర రూ. 98.43గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.11లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.99.46గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.82 గా ఉండగా.. డీజిల్ ధర రూ.99.96గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 108.16 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.99.74లకు లభిస్తోంది.

Also Read:నిహారిక భర్త చైతన్య కేసులో అలాంటి ట్విస్టు
దేశ వ్యాప్తంగా పెట్రోల్డీ జిల్ ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.84గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.87 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.83కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.45గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.102.08 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 93.02 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.49ఉండగా.. డీజిల్ ధర రూ.94.39గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.105.25 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.95.26 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.96 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.90.15గా ఉంది.

Petrol Rates Not Increased