Telugu News

మరుపురాని మనిషి ‘ సూపర్‌స్టార్ “: పొంగులేటి

తెలుగు సినిమా గమనాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళిన ఘనుడు

0

మరుపురాని మనిషి ‘ సూపర్‌స్టార్ “
– తెలుగు సినిమా గమనాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళిన ఘనుడు
– మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి

(ఖమ్మం-విజయంన్యూస్)
ఖమ్మం : సాహాసానికి ఊపిరి… ధైర్యానికి పర్యాయ పదం… పట్టుదల, మానవత్వం, మంచితనం వీటన్నిటి కలబోత సూపర్ స్టార్ కృష్ణ. అలాంటి మరుపురాని మనిషి మనల్ని వదిలి వెళ్ళిపోవడం బాధాకరం అని తెరాస రాష్ట్ర నాయకులు ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తెలుగు సినిమా గమనాన్ని తనదైన ప్రత్యేక శైలితో పతాకస్థాయికి తీసుకువెళ్ళిన ఘనత కృష్ణకే దక్కుతుందన్నారు. అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, భారత సినీ పరిశ్రమలోనే చాలా అరుదు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, నిర్మాణ సంస్థ అధినేతగా తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాలపాటు సూపర్ స్టార్ అందించిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. అలాంటి ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు, అసంఖ్యాకమైన కృష్ణ అభిమానులకు పొంగులేటి తన ప్రగాడ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు.

ఇది కూడా చదవంఢి: దివికేగిన బుర్రిపాలెం బుల్లోడు