Telugu News

సూపర్ స్టార్ కృష్ణ 81వ జయంతి వేడుకలు

సూపర్ స్టార్ కృష్ణ కు మరణం లేదు

0

సూపర్ స్టార్ కృష్ణ 81వ జయంతి వేడుకలు

== సూపర్ స్టార్ కృష్ణ కు మరణం లేదు

(ఖమ్మం-విజయం న్యూస్):

(రిపోర్టర్ -పెండ్ర అంజయ్య)

స్వర్గీయ శ్రీ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ 81వ జయంతి వేడుకలు ఖమ్మం జిల్లా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన ఆధ్వర్యంలో స్థానిక మాత శిశు చిన్నపిల్లల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆస్పత్రిలోని రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేసి వారి నడుమ కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన జిల్లా గౌరవ అధ్యక్షులు తోట రంగారావు, జిల్లా అధ్యక్షులు దేవభక్తుని కిషోర్ బాబు, నగర అద్యక్షులు మునగాల బాలు, సత్తుపల్లి నుండి కే వెంకటేశ్వరావు, మహబూబాద్ నుంచి గౌరవ అధ్యక్షులు ఎస్.మనోహర్, ఖమ్మం జిల్లా కన్వీనర్ బాణాల లక్ష్మణ్, నగర కన్వీనర్ పులిపాటి సంపత్ కుమార్, నగర గౌరవాధ్యక్షులు నాగార్జున, బ్రహ్మం, సహాయ కార్యదర్శి నల్లబెల్లి గౌతమ్, నగర కార్యదర్శి మాలోత్ రవి, సుధాకర్, నరసింహారావు, మర్రి శివ, మహేష్ చౌదరి మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా, సాహసమే ఊపిరిగా , డేరింగ్ అండ్ డాష్ హీరోగా, తెలుగు చిత్ర సీమలో రారాజుగా, గొప్ప మానవతా మూర్తి, మహా మనిషి అలాంటి మనిషి మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. అలాగే చిత్ర పరిశ్రమకు తీరని లోటు అన్నారు.