Telugu News

‘పేట కాంగ్రెస్’ లో అధిపత్య పోరు

మండలానికి ఇద్దరు,ముగ్గురు అధ్యక్షులు

0

నేనే బాస్…?

== ‘పేట కాంగ్రెస్’ లో అధిపత్య పోరు

 == మండలానికి ఇద్దరు,ముగ్గురు అధ్యక్షులు

 == నాయకుడేవ్వరో అర్థంకాక అయోమయం పార్టీ శ్రేణులు

== నిశబ్ధం పాటిస్తున్న అగ్రనాయకత్వం

(శివనాగిరెడ్డి,చండ్రుగొండ-విజయంన్యూస్)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో 5 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవుల్లో ఆధిపత్య పోరు కొనసాగుతుంది. మండలానికి తాజా, మాజీలు మేమే అధ్యక్షులు మని చెప్పుకుంటూ పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అశ్వరావుపేట నియోజకవర్గంలో చండ్రుగొండ, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, దమ్మపేట, అశ్వరావుపేట మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో గతంలో పార్టీ మండల అధ్యక్షులుగా ఎంపిక చేశారు. పార్టీ సభ్యత్వ నమోదాలలో అత్యధికంగా చేసిన వారిని గుర్తించి డిసిసి ఇటీవల పలువురికి మండల అధ్యక్షులుగా కేటాయిస్తూ నియామక పత్రం జారీ చేశారు.

ఇది కూడా చదవండి: ఫ్లాన్-బీ దిశగా పొంగులేటి

ఈ క్రమంలో నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ఇద్దరు వ్యక్తులు మండల అధ్యక్షులుగా చలామణి అవుతున్నారు. చండ్రుగొండలో ముగ్గురు వ్యక్తులు మండల అధ్యక్షులుగా చెప్పుకోవడం గమనర్హం. గతంలో పార్టీ మండల అధ్యక్షులుగా సాబీర్ హుస్సేన్ కొనసాగుతుండగా సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా డిసిసి అధ్యక్షులు పొదెం వీరయ్య దారం గోవిందరెడ్డికి మండల అధ్యక్షునిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది జీర్ణించుకోలేని మండల స్థాయి సీనియర్ నేతలు ఇటీవల మండల స్థాయిలో చండ్రుగొండలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్య అతిథిగా జెడ్పిటిసి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో అన్ని పంచాయతీల కార్యకర్తలు యువజన నేత కేసు బోయ నరసింహారావును మండల అధ్యక్షునిగా ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో మండల అధ్యక్షుని పదవి రేసులో ముగ్గురు వ్యక్తులు ఉండడంతో ఎవరు అనేది తెలియక కార్యకర్తలు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇదే తరహాలో నియోజకవర్గంలోని మిగిలిన నాలుగు మండలాల్లో ఇద్దరు వ్యక్తులు చొప్పున తామే అధ్యక్షులు మని ప్రకటించుకుంటూ కార్యకర్తలను సమయత్వం చేసుకుంటున్నారు.

== అయోమయంలో కార్యకర్తలు*          ఇదికూడా చదవగలరు: – ‘పేట’ కాంగ్రెస్ కు నాయకుడేడి..?

తామే మండల అధ్యక్షులు మని ప్రకటించుకుంటున్న నేతలతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ఎవరు అధ్యక్షులని విషయం కార్యకర్తలకు ప్రశ్నార్థకంగా మారింది. మండలంలో పార్టీ పరంగా చేపట్టే కార్యకలాపాలలో ఎవరికి మద్దతు ఇవ్వాలని కార్యకర్తలు సమాలోచనలులో పడ్డారు. నేటికి డిసిసి అధ్యక్షులు నియోజకవర్గంలో మండల వారీగా సమావేశాలు నిర్వహించకపోవడంపై కార్యకర్తలలో చర్చనీయాంసంగా మారింది. ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియకుండా కార్యకర్తలు ఆలోచనలో పడ్డారు.

== పట్టించుకోని జిల్లా కాంగ్రెస్ కమిటీ*

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వరావుపేట నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీలో మార్పులు చెందుతున్న డిసిసి అధ్యక్షులు సరైన నిర్ణయం ప్రకటించకపోవడంతో కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో ఇద్దరు,ముగ్గురు చొప్పున అధ్యక్షులు రేసు లో ఉండగా డిసిసి అధ్యక్షులు ఒకరే ఉన్నారని చెప్పి ఎందుకు ప్రకటించలేదని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై పలువురు టీపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు విశ్వాసనీయ సమాచారం. ఇది ఇలాగే కొనసాగితే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో గట్టు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది.

== టికెట్ రేస్ లో పోటీ*

అశ్వరావుపేట నియోజకవర్గం వర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు టికెట్టు కైవసం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ములకలపల్లి జడ్పిటిసి సున్నం నాగమణి, మాజీ ఎమ్మెల్యే వాగేల మిత్ర సేన వారసులైన వగెల పూజ బరిలో ఉన్నారు. ఎవరికి టికెట్ వచ్చినా కార్యకర్తలు వారికి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. పార్టీ టికెటు సాధించడంలో పై ముగ్గురు పోటీ పడుతున్నారు. వారి వారి రాష్ట్రస్థాయి నేతలను కలుసుకొని పైరవీలు చేసుకోవడంలో నిమగ్నమయ్యారు.

ఇది కూడా చదవండి: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు..