టి.పాలెం ఐటం. కన్నుల పండుగగా శ్రీకూసుమ హరనాథ స్వాముల కల్యాణం.
ముఖ్యతిధిగా పాల్గొన్న కందాల ప్రత్యేక పూజలు నిర్వహించారు.
టి.పాలెం ఐటం.
కన్నుల పండుగగా శ్రీకూసుమ హరనాథ స్వాముల కల్యాణం.
ముఖ్యతిధిగా పాల్గొన్న కందాల ప్రత్యేక పూజలు నిర్వహించారు.
(తిరుమలాయపాలెం – విజయం న్యూస్)
తిరుమలాయపాలెం మండలకేంద్రంలో శ్రీ కుసుమ హారనాథ బాబా మందిరంలో కొలువైవున్న శ్రీ కుసుమ హరనాథ బాబా స్వాముల వారి కల్యాణ మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. కరోనా నిబంధనలు పాటిస్తూ బూర్ర సుందరమచార్యులు జరిపిన స్వాముల వారి కల్యాణ మహోత్సవంలో ముఖ్యతిధిగా పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పాల్గొన్నాడు.
ముందుగా బాబా మందిరంలో కందాల ప్రత్యేక పూజలు నిర్వహించారు.
also read :-దమ్మపేట రెవెన్యూ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేత…..
కన్నుల పండుగగా జరిగిన శ్రీ కుసుమ హరనాథ బాబా స్వాముల వారి కల్యాణాన్ని ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి దగ్గరుండి తిలకించారు.
కందాల వెంట మండల ఎంపీపీ బొడ మంగీలాల్, స్థానిక సర్పంచ్ కొండబాల వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు మద్దినేని వీరభద్రం, మధు, కె.కరుణ, కొమ్ము శ్రీను, గోళ్ళ లింగయ్య, మల్లిడి రమేష్, బొడ్డుపల్లి నాగప్రసాద్. తదితరాలున్నారు.