తగరం సందీప్ కుమార్ కు జాతీయ స్థాయి అవార్డు
ఖమ్మం నగరం లోనీ ఖానాపురం కు చెందిన తగరం సందీప్ కుమార్ కు" పీస్ ఆఫ్ క్రియేషన్స్ " ఫోటో గ్రఫీ వర్క్ షాప్ లో జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది.
తగరం సందీప్ కుమార్ కు జాతీయ స్థాయి అవార్డు
( ఖమ్మం – విజయంన్యూస్):
ఖమ్మం నగరం లోనీ ఖానాపురం కు చెందిన తగరం సందీప్ కుమార్ కు” పీస్ ఆఫ్ క్రియేషన్స్ ” ఫోటో గ్రఫీ వర్క్ షాప్ లో జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది.చిన్నతనం నుండే ఫోటోగ్రఫీ పై మక్కువ పెంచుకున్న సందీప్ కుమార్ తాను నమ్ముకున్న ఫోటోగ్రఫీ వృత్తిలోనే ఉత్తమంగా రాణించేవాడు.
జిల్లా స్థాయిలో అనేక అవార్డులు సొంత చేసుకున్నాడు.జిల్లా స్ధాయి నుండి నేడు జాతీయ స్ధాయిలో ఉత్తమ అవార్డు కైవసం చేసుకోవడం జిల్లాకు గర్వకారణం. 2022 జనవరి 19 నుండి 22 వరకు జరిగిన హుస్సేన్ ఖాన్ ఆద్వర్యంలో నేషనల్ లెవెల్ ఫోటోగ్రఫీ వర్క్ షాప్ అరకు , ఒడిస్సాలో జరిగింది. ఈ ఫోటోగ్రఫీ వర్క్ షాప్ నందు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ఫోటోగ్రాఫర్స్ పాల్గొన్నారు.
also read :- సభ్యత్వ నమోదు తో మన సత్తా తేల్చాలి
ఈ వర్క్ షాప్ లో ఖమ్మం కు చెందిన తగరం సందీప్ కుమార్ (పీస్ ఆఫ్ క్రియేషన్స్) కు జాతీయ స్ధాయి అవార్డు అందుకున్నాడు. జాతీయ స్ధాయి అవార్డు లభించడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుండి పలువురు ఫోటోగ్రఫర్స్ అభినందనలు తెలిపారు. భవిష్యత్ లో మరిన్ని బహుమతులు గెలుచుకొని ఖమ్మం జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తేవాలని సూచించారు.
also read :- జిల్లాల పార్టీ నూతన అధ్యక్షులకు మంత్రి పువ్వాడ శుభాకాంక్షలు