Telugu News

శంకరంపల్లి లో పులి సంచారం…!!

ఏఏంసి గోదాం వద్ద చూసిన స్థానికులు...

0

శంకరంపల్లి లో పులి సంచారం…!!

**ఏఏంసి గోదాం వద్ద చూసిన స్థానికులు…

**అటవీశాఖ అధికారులకు సమాచారం…

(విజయం న్యూస్- మహాదేవపూర్)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని శంకరంపల్లి గ్రామ శివారులో పులి సంచరించడం కలకలం రేపింది… స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో శంకరంపల్లి ఏ ఎమ్ సి గోదాం వైపు నుండి రుద్రారం వైపు పులి వెలుతుండగా బైక్ పై వెళుతున్న సూరం రాములు, సూరం శ్రీకాంత్ అను వక్తులు చూశారు.. వెంటనే స్థానిక సర్పంచ్ అంగజాల అశోక్, గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు.. సర్పంచ్ అశోక్ వెంటనే అటవీ శాఖాధికారులకు, పోలీస్ అధికారులకు సమాచారం అందించారు.. గ్రామస్తులు ఎవరు అటు వైపు వెళ్లకూడదని అప్రమత్తం చేశారు.. సోమవారం ఉదయం స్థానికులు, అడవి శాఖ సిబ్బంది గోదాం ప్రాంతంలో చూడగా పులి అడుగులు కనిపించాయి.. శంకరంపల్లి గోదాం పక్క నుండి అటవీ ప్రాంతం మీదుగా రుద్రారం వైపుగా పులి వెళ్లిందని భావిస్తున్నారు… అయితే ఎవరు భయాందోళనకు గురి కావద్దని, అటవీ ప్రాంతంలో కి ఎవరు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు అధికారులు సూచించారు… అయితే సోమవారం తెల్లవారుజామున స్థానికుల సమాచారం మేరకు రుద్రారం- కొయ్యూరు మధ్యలో శభాష్ నగర్ వద్ద రోడ్డు దాటినట్టుగా పులి అడుగులు అటవీశాఖ అధికారులు గుర్తించినట్లు సమాచారం..

allso read :- రాయల’ దైర్యమేంటి..?