Telugu News

సత్తా చాటిన టిఎల్ పేట విద్యార్థులు

గురుకుల సీట్లు సాధించడంలో రికార్డు

0

సత్తా చాటిన టిఎల్ పేట విద్యార్థులు

== గురుకుల సీట్లు సాధించడంలో రికార్డు

ఏన్కూరు. జూన్ 1( విజయం న్యూస్ )

 

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం తూతక్క లింగన్నపేట గ్రామానికి చెందిన విద్యార్థులు ఐదవ తరగతి గురుకుల ప్రవేశ పరీక్షల్లో ఎక్కువ సీట్లు సాధిస్తూ,తమ సత్తా చాటుతున్నారు. రికార్డు సృష్టిస్తున్నారు. 25 సంవత్సరాల నుండి వివిధ గురుకుల విద్యాలయాల్లో వందలాదిమంది సీట్లు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సీట్లు సాధించి గురుకుల విద్యాలయాల్లో విద్యను అభ్యసించి, ఉన్నత స్థాయికి వెళ్లి, వివిధ రంగాల్లో ఉద్యోగాలు సాధించి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఎక్కడ పరీక్ష పెట్టిన, ఎప్పుడు పరీక్ష పెట్టిన,ఆత్మవిశ్వాసం, పట్టుదల, ధైర్యంతో పరీక్ష రాసి అందరికంటే ముందంజలో సీట్లు సాధిస్తూ, తమ సత్తాను ప్రతిభను చాటుతున్నారు టిఎల్ పేట విద్యార్థులు.ప్రతి ఏడాది సీట్లు సాధిస్తున్న, ఈ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న జుజ్జూరి కృష్ణమాచారిని, ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు అభినందిస్తున్నారు. హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలుపెరగకుండా గురుకుల ప్రవేశాలకు శిక్షణ ఇస్తూ వందలాది మంది విద్యార్థులకు సీట్లు వచ్చే విధంగా కృషి చేస్తున్న ఆ గ్రామానికి చెందిన జె.కృష్ణమాచారినిఅభినందించారు.అభినందిస్తున్నారు. జిల్లాలోనే ఈ గ్రామానికి విద్యాభివృద్ధిలో పేరు తెచ్చారు.

ఇది కూడా చదవండి: కొణిజర్లలో ఘోర ప్రమాదం..ముగ్గురు మృతి