Telugu News

‘పాలేరు’ బరిలో తమ్మినేని

సీపీఎం కు కేటాయిస్తే కలిసి పనిచేసేందుకు సీపీఐ సిద్దం

0

‘పాలేరు’ కు తమ్మినేని

== కసరత్తు ప్రారంభించిన కమ్యూనిస్టులు

== సీపీఎం కు కేటాయిస్తే కలిసి పనిచేసేందుకు సీపీఐ సిద్దం

== స్పష్టం చేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

== బీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వకపోయిన పోటీ చేసేందుకు సీపీఎం సై

== నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తున్నతమ్మినేని

== ఊరూరా కార్యక్రమాలు.. ప్రజల్లోకి వెళ్లేందుకు కసరత్తు

== అయోమయంలో గులాబీ దళం

allso read- పాలేరులో సిపిఎం పార్టీ పోటీ చేయడం ఖాయం

పాలేరు నియోజకవర్గం రేసులో కమ్యూనిస్టులు సై అంటున్నారు.. అందుకు కావాల్సిన కసరత్తులో నిమగ్నమైయ్యారు..  కాలుదువ్వుతూ కదం తొక్కుతున్నారు.. పొత్తులున్నా లేకపోయిన పాలేరులో పోటీ చేసేది చేసేదే అంటూ స్పష్టం చేస్తున్నారు.. సీపీఎం పోటీ చేస్తే సీపీఐ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపి ఎన్నికల్లో భాగస్వామ కూటమిగా అడుగులేసే అవకాశం ఉంది.. పొత్తుల బందంలో టిక్కెట్ బంధి అయితే బంధాన్ని తెంచుకునేందుకు సీపీఎం సిద్దమైనట్లు సమాచారం. అలా సర్వం సిద్దమైన  సీపీఎం పార్టీ.. రాబోయే ఎన్నికల బరిలో తమ్మినేని తన భవిష్యత్ ను తెల్చుకునే పనిలో నిమగ్నమైయ్యారు. తాడోపేడో తెలుసుకునే ఆలోచనలో ఉన్న కమ్యూనిస్టులు అవసరమైతే ప్రతిపక్ష పార్టీలన్నింటిని కలుపుకుని పోవాలని నిర్ణయుంచుకున్నట్లు తెలుస్తోంది. పాలేరు పై కన్నేసిన కమ్యూనిస్టుల అంశంపై ‘విజయం’ పత్రిక అందించే ప్రత్యేక కథనం..

(కూసుమంచి-విజయంన్యూస్)

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ‘పాలేరు నియోజకవర్గం’ చుట్టు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది..  ప్రస్తుతం హాట్ టాఫిక్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిని ఈ నియోజకవర్గ రాజకీయాలు రోజుకో మలుపుతిరుగుతున్నాయి.. జనరల్ స్థానమైన ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నప్పటికి అన్ని పార్టీలు పోరు రేసులో పోట్లాడుతున్నాయి.. మేమంటే మేమే పోటీ చేస్తామంటూ పోరుకు సై అంటున్నానరు..  సవాల్, ప్రతిసవాల్ చేసుకుంటున్నారు.. ఇక దోస్తుల పంచాయతీ రోజురోజుకు ముదురుతూనే ఉంది.. ఒక వైపు బీఆర్ఎస్ పార్టీ అధినేతతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న కమ్యూనిస్టులు.. పాలేరు నియోజకవర్గంకు వచ్చే సరికి నీదోదారి..నాదోదారి అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లే కనిపిస్తున్నారు.. కమ్యూనిస్టులకు నూకలు చెల్లాయని అధికార పార్టీ ఎమ్మెల్యే బహిరంగంగా సంచలన వ్యాఖ్యలు చేయగా, కమ్యూనిస్టులు లేకపోతే ఆయనకేప్పుడో నూకలు చెల్లేయి అంటూ కామ్రెడ్స్ కౌంటర్ సందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.. అయితే ఈ పోరు రేసులో కమ్యూనిస్టులు నిలబడి కోట్లాడే పరిస్థితి కనిపిస్తోంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే

ఇది కూడా చదవండి: ‘పాలేరు’లో ముదురుతున్న దోస్తుల లొల్లి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అత్యంత ప్రాథాన్యత కల్గిన నియోజకవర్గం ‘పాలేరు’. ఉమ్మడి జిల్లాలో మూడు జనరల్ స్థానాలు ఉండగా, అందులో పాలేరు నియోజకవర్గం చాలా క్రిటికల్ నియోజకవర్గం. ఇప్పటి వరకు మొత్తం 14 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 11 సార్లు కాంగ్రెస్ గెలిచింది. రెండు సార్లు సీపీఎం, ఒక్కసారి జనతా పార్టీ గెలిచింది. రెండు సార్లు ఉప ఎన్నికలు రాగా ఒక సారి కాంగ్రెస్, మరో సారి టీఆర్ఎస్ గెలిచింది. అలా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ పాలేరు నియోజవర్గంలో  బీఆర్ఎస్, సీపీఎం పార్టీలు పోటీ పడుతున్నాయి. కొత్తగా వచ్చిన వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్.షర్మిళ, బహుజన సమాజ్ వాధి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసే యోచనలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే ముగ్గురు ఆశావాహులుగా ఉండగా, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జలగం వెంకట్రావ్, జలగం ప్రసాద్ రావు, రఘురామ్ రెడ్డి, దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక కారు పార్టీలో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్  రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రేసులో ఉన్నారు. వారి ఇద్దరి మద్య నువ్వానేనా..? అన్నట్లు సాగుతోంది. వర్గపోరు భగ్గుమంటోంది. ఈ ఇద్దరి వర్గపోరు పార్టీ శ్రేణులకు తలనొప్పిగా మారినప్పటికి, మరో తలనొప్పి బీఆర్ఎస్ పార్టీని కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మరి ముఖ్యంగా ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి సీపీఎం పార్టీ పంటికింద రాయిల తయారైంది.

== పాలేరు నుంచి పోటీకి సై అంటున్న తమ్మినేని

రాబోయే ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి కచ్చితంగా పోటీ చేస్తామని సీపీఎం పార్టీ తెల్చి చెబుతోంది.. ఇప్పటికే అనేక సార్లు అనాధికారికంగా ప్రకటన చేసిన కమ్యూనిస్టులు, ప్రస్తుతం డైరెక్ట్ గా బహిరంగంగా మీడియాకు చెబుతున్నారు. పాలేరు నియోజకవర్గం నుంచి సీపీఎం పార్టీ పోటీ చేస్తుందని, పొత్తులు కొనసాగిన, లేకపోయినప్పటికి కచ్చితంగా పాలేరు నుంచి పోటీ చేస్తామని సీపీఎం నాయకులు స్పష్టం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ‘పాలేరు’లో మద్యం దందా..?

అంతే కాదు స్వయాన రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం కూడా మీడియా ఇంటర్వ్యూలో పోటీ చేసే విషయంపై క్లారిటీ ఇచ్చారు. పార్టీ అదేశిస్తే కచ్చితంగా పోటీ చేస్తానని చెబుతున్నారు. నేను పోటీ చేసిన చేయకపోయిన సీపీఎం పార్టీ మాత్రం కచ్చితంగా పోటీ చేస్తుందని కరాఖండిగా తెల్చి చెబుతున్నారు. ఇప్పటికే తమ్మినేని వీరభద్రం నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. పలు గ్రామాల్లో మీటింగ్ లను ఏర్పాటు చేశారు. చైతన్య యాత్ర పేరుతో నాలుగు మండలాల్లో బహిరంగ సభలను పెట్టి కార్యకర్తలకు నేనోస్తున్న అంటూ భరోసా కల్పించారు. అలాగే గ్రామాల్లో పర్యటిస్తూ కార్యకర్తలను, ప్రజలను పరామర్శిస్తున్నారు. ప్రజల అభిప్రాయలను కూడా తెలుసుకుంటున్నారు. అలాగే సీపీఎం నేతలు, కార్యకర్తలు కూడా ఆయా మండలాల్లో, గ్రామాల్లో సీపీఎం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

== పోటీ ఎలా సాధ్యం..?

రాబోయే ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ పార్టీ అధికార బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది. ఇప్పటికే స్పష్టంగా ప్రకటించారు. సీట్ల పంపకాలు విషయంలో చర్చలు జరగలేదు కానీ మౌకికంగా వారి పొత్తులు ఖారారైనట్లు సీపీఎం, సీపీఐ పార్టీ కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే ఖమ్మం జిల్లాలో వారి పొత్తులకు బ్రేకులు పడే అవకాశం కనిపిస్తోంది..అసలు  కమ్యూనిస్టులు రాష్ట్రంలో బలంగా ఉంది ఖమ్మం జిల్లాలోనే. ఆ పార్టీలు గతంలో గెలిచింది కూడా ఖమ్మం, నల్గొండ జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహించారు కూడా. అందులో ముఖ్యంగా పాలేరు,ఖమ్మం, కొత్తగూడెం, వైరా, భద్రాచలం, మధిరలో సీపీఎం, సీపీఐ పార్టీలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా సీపీఎం పార్టీకి పాలేరు, ఖమ్మం, భద్రాచలంలో బలంగా ఉంటే, కొత్తగూడెం, వైరా నియోజకవర్గాల్లో సీపీఐ పార్టీలు బలంగా ఉంటాయి.

ఇది కూాడా చదవండి: పొంగులేటి మాటే మా బాట…!

అందులో భాగంగానే పొత్తుల విషయంలో సీపీఎం పార్టీ పాలేరు, భద్రాచలం, మధిర నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరికొన్ని సీట్లను కోరుతుంది. సీపీఐ పార్టీకి కొత్తగూడెం, వైరా నియోజకవర్గాలతో ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో సీట్లు అడుగుతున్నారు. అందులో ముందువరసలో సీపీఎంకు పాలేరు, సీపీఐకి కొత్తగూడెం నియోజకవర్గాలున్నాయి. ఇదే విషయాన్ని తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావులు కూడా స్పష్టం చేశారు. అయితే ఈ పాలేరు, కొత్తగూడెం, వైరాలో బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక వైపు సీఎం కేసీఆర్ సిట్టింగ్ లకు కచ్చితంగా సీట్లు ఇస్తామని ప్రకటిస్తున్నారు. మరీ  ఈ సందర్భంలో కమ్యూనిస్టులు అడుగుతున్న ఈ టిక్కెట్లను ఇచ్చే అవకాశం ఉందా..? లేదా..? అనే ప్రశ్నలు ప్రజల మనుషులను తట్టిలేపుతున్నాయి.  వారు అడిగే సీట్లు కూడా అవ్వే కావడంతో బీఆర్ఎస్ తో పయనం కమ్యూనిస్టులకు కష్టంగానే ఉన్నట్లు భావించాల్సి ఉంది.

== సీపీఎం పోటీ చేస్తే సీపీఐ మద్దతు

ఒక వైపు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు అంటూనే పాలేరు నియోజకవర్గంలో సీపీఎం, కొత్తగూడెం నియోజకవర్గంలో సీపీఐ పార్టీలు పోటీ చేసేందుకు కమ్యూనిస్టులు సిద్దమైయ్యాయి.. బీఆర్ఎస్ తో పొత్తు ఉన్న లేకున్నా ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసేందుకు సిద్దమైయ్యాయి. పాలేరు నుంచి తమ్మినేని వీరభద్రం, పొతినేని సుదర్శన్ లేదంటే రాధాక్రిష్ణ కోడల్ని రంగంలోకి దింపే ఆలోచనలో సీపీఎం పార్టీ అధిష్టానం ఉండగా, సీపీఐ పార్టీ మాత్రం కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు పోటీ చేసేందుకు సిద్దమైయ్యారు. ఈ మేరకు నైతికంగా పార్టీ కార్యకర్తలకు, ముఖ్యనాయకులకు ఇప్పటికే సందేశాలిచ్చినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ తో పొత్తు ఉన్న లేకపోయిన ఈ రెండు సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే జరిగితే కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద డ్యామేజీ తప్పదు. పొత్తుల్లో సీపీఎం, సీపీఐ పార్టీలకు  రెండు జనరల్ నియోజకవర్గాలను కేటాయిస్తే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పతనం ఖాయమైనట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే సీట్ల పంపకాలు, పొత్తుల విషయంలో ఏం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు. కందాళకు టిక్కెట్ వస్తుందా..? రాదా..? తుమ్మల నాగేశ్వరరావు పరిస్థితి ఏంటనే విషయంపై తర్జన భర్జన అవుతున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో..?