Telugu News

రేపు భద్రాద్రికి చంద్రన్న రాకా

భద్రాచలంకు  చంద్రబాబు నాయుడి పర్యటన ఖారారు 

0

రేపు  భద్రాద్రికి చంద్రన్న రాకా

== భద్రాచలంకు  చంద్రబాబు నాయుడి పర్యటన ఖారారు 

== 28,29న ఏపీ, తెలంగాణ లోని ముంపు ప్రాంతాల్లో పర్యటన

== 28 రాత్రి భద్రాచలంలోనే బస

== 9న భధ్రాచలంలోని రామయ్యకు పూజలు

==  కరకట్టను పరిశీలించనున్న మాజీ సీఎం

ఖమ్మంప్రతినిధి, జులై 27(విజయంన్యూస్)

భద్రాచలంలోని  గోదావరిని అడ్డుకున్న కరకట్ట నిర్మాణ కర్త, భద్రాద్రి మునిగిపోకుండా కాపాడిన ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారికంగా పర్యటన ఖారరైంది. గురువారం  రాత్రి భద్రాచలంకు చేరుకుని అక్కడే బస చేయనున్నారు. మరసటి రోజున భద్రాచలం పరిసర ప్రాంతాల్లో పర్యటించి ముంపు ప్రాంతాల ప్రజలను పరామర్శించనున్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా. తెలంగాణా కు రేపు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు. రేపు ఉదయం 8గంటలకు ఉండవల్లి లోని తన నివాసం నుంచి బయలుదేరి విజయవాడ మీదుగా మైలవరం, తిరువూరుకు చేరుకుని, అక్కడ నుంచి 10గం.లకు తెలంగాణ రాష్ట్రంలోని సత్తుపల్లి నియోజకవర్గం  పెనుబల్లి, మీదుగా సత్తుపల్లి నుంచి అశ్వరావుపేట నుంచి  వినాయకపురం చేరుకుంటారని ఖమ్మం పార్లమెంటు అధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు తెలియజేశారు.  అనంతరం మళ్లీ ఏపీలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని గోదావరి వరద బాధిత కుటుంబాలను పరామర్శించించనున్నారు.

allso read- ప్రశ్నిస్తే ఎంపీలను సస్పెండ్ చేస్తారా ? : ఎంపీ నామ

అనంతరం మధ్యాహ్నం సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భూర్గంపాడు కు చేరుకుని అక్కడ వరద బాధితులను పరామర్శించనున్నట్లు తెలిపారు. అనంతరం  సారపాక, ప్రాంతాల్లోని గోదావరి వరద బాధిత కుటుంబాలని పరామర్శిస్తారని, అనంతరం భద్రాచలంలో రాత్రికి బసచేశారని తెలిపారు. సారపాకలో విలేకర్ల సమావేశం ఉంటుందని, అనంతరం భద్రాచలంలోనే ఓ నివాసంలో బస చేయనున్నట్లు తెలిపారు. అనంతరం 29న ఉదయం  9 గంటలకు భద్రాద్రిలోని శ్రీరాముని దర్శనం చేసుకుంటారని, ఆ తరువాత పూజల అనంతరం  గోదావరి కరకట్ట ప్రాంతాన్ని పరిశీలించనున్నట్లు తెలిపారు. అనంతరం  భద్రాచలంలోని వరద బాధిత కుటుంబాలను పరామర్శించడం జరుగుతుందన్నారు.

== చంద్రబాబుకు భారీగా స్వాగత ఏర్పాట్లు

తెలంగాణ ప్రాంతానికి వస్తున్న చంద్రబాబు నాయుడికి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు, నాయకులు సత్తుపల్లి వద్దకు చేరుకోవాలని ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. దీంతో వేలాధి మంది కార్యకర్తలు సత్తుపల్లికి రానున్నారు. సత్తుపల్లి, లేదంటే పెనుబల్లి వద్దనే చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఆయన పర్యటించే ప్రాంతాల్లో పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: సర్కార్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం లేదా..?