Telugu News

తెలంగాణలో టీడీపీ బలం చూపిస్తాం: చంద్రబాబు

ఉమ్మడి ఖమ్మం జిల్లా టిడిపికి కంచుకోట

0

తెలంగాణలో టీడీపీ బలం చూపిస్తాం: చంద్రబాబు

?తెలుగు జాతి ఉన్నంత వరకు ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ
?తెలంగాణలో బలమైన శక్తిగా టిడిపి
?ఉమ్మడి ఖమ్మం జిల్లా టిడిపికి కంచుకోట
?వెంకట నరసయ్య కుటుంబానికి రూ.లక్ష ఆర్దిక సాయం
?టిడిపి జాతీయ అధ్యక్షులు,మాజీ సీఎం చంద్రబాబు నాయుడు

?భద్రాచలంలో పర్యటించిన మాజీ సీఎం

?రామయ్యకు ప్రత్యేక పూజలు

(రిపోర్టర్ : రాజశేఖర్ రెడ్డి)

బూర్గంపహాడ్ /భద్రాచలం, జూలై 29(విజయం న్యూస్ )

బూర్గంపహాడ్ తెలంగాణలో టిడిపి బలమైన శక్తిగా మారుతోందని,తెలుగు జాతి ఉన్నంత వరకు ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.గురువారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని బూర్గంపాడు,రెడ్డిపాలెం, సారపాక ప్రాంతాలలో వరద ముంపు ప్రాంతాలలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బూర్గంపాడు లో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణలో టిడిపి మరింత బలపడు తుందని ఆయన అన్నారు.తెలుగుదేశం ఆవిర్భా వమే తెలంగాణలోని హైదరాబాద్ లో జరిగిందని ఆయన అన్నారు.యువత భవిష్యత్తు బాగుండాలంటే తెలంగాణ లోనూ తెలుగుదేశం ఉండాలని ఆయన పేర్కొన్నారు.

allso read- చంద్రుగొండలో పోడుదారులు, పారెస్టు అధికారుల మధ్య ఘర్షణ

ఉమ్మడి ఖమ్మం జిల్లాతో తెలుగుదేశం పార్టీకి విడదీయరాని బంధం ఉందని ఆయన అన్నారు.తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా కంచుకోట అని ఆయన అన్నారు. మిమ్ములను చూస్తుంటే తెలంగాణతో పాత అనుభవాలు గుర్తు కొస్తున్నాయని ఆయన అన్నారు. దూర దృష్టితో 2000 సంవత్సరంలో భద్రాచలంలో చేపట్టిన కరకట్టల అభివృద్ధి ఇప్పుడు అందరిని కాపాడిందని ఆయన తెలిపారు. బూర్గంపాడులో గోదావరి వరదల్లో వెంకట నరసయ్య మరణం తీవ్రంగా కలచి వేసిందని ఆయన అన్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ పార్టీ పరంగా రూ.లక్ష సాయం అందిస్తామ ని ఆయన పేర్కొన్నారు.ఇలాంటి వరద లొచ్చినప్పుడు ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. వరద బాధితులకు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన అన్నారు. వరద బాధితులకు న్యాయం జరిగేంత వరకూ తెలుగుదేశం పార్టీ వరదబాధితుల పక్షాన నిలుస్తుందని, ఉంటుందని ఆయన అన్నారు.

== చంద్రబాబుకు వినతి పత్రం అందజేసిన సర్పంచ్ స్వప్న:

మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు బూర్గంపాడు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సిరిపురపు స్వప్న వినతిపత్రాన్ని అందజేశారు. ముంపుకు గురవుతున్న బూర్గంపాడుకు పోలవరం ప్యాకేజీ అందేలా చూడాలని, బూర్గంపాడు కు అన్ని విధాల న్యాయం జరిగేలా చూడాలని వినతి పత్రాన్ని ఆమె అందజేశారు. అదే విధంగా బూర్గంపాడు అంబేద్కర్ సెంటర్లో నాగినేని పోలు రెడ్డి పాలెం గ్రామంలో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు. రెడ్డిపాలెం గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సారపాక లో వరద బాధితుల ను పరామర్శించి ఆయన మాట్లాడారు. కాగా గురువారం రాత్రి జరిగిన చంద్రబాబు సభలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావడం విశేషం.ఈ కార్యక్రమాల్లో టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు, టిఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు, ఐటీసీ గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు కనకమేడల హరిప్రసాద్, టిడిపి బూర్గం పాడు మండల అధ్యక్షులు తాళ్ళూరి జగదీశ్వరరావు, కే సత్యనారాయణ, నాయకులు బొల్లి రామారావు, దుద్దుకూరి రామకృష్ణ, దుద్దుకూరి రమేష్ , నాసిర్, తదితరులు పాల్గొన్నారు
రెడ్డిపాలెంలో గోమ్మూరు కాలనీలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు స్థానిక టిడిపి నేత ఎర్ర బాబు ఆధ్వర్యంలో రెడ్డిపాలెం లో ఇక్కడ రాజకీయాల గురించి చంద్రబాబు మాట్లాడారు.భద్రాద్రి సీతారామ చంద్ర స్వామీ వారి దేవాలయ్యాన్ని దారిసించుకున్న చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుగా భద్రాద్రి సీతారామ చంద్ర స్వామీ వారి దేవాలయం దర్శించుకున్నారు.ఆయనకు ఆలయ వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలా మధ్య ఘన స్వాగతం పలికారు. అనంతరము ప్రత్యేక పూజలు పాలుగున్నరు.

allso read- నాడు..నేడు అదే గోస.. గిరిజనుల అరిగోస

== భద్రాచలం గోదావరీ కరకట్టను పర్శించిలించిన చంద్రబాబు

దైవ దర్శనం అనంతరం భద్రాచలం గోదావరీ కరకట్టను పర్శించిలించారు.
చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 1986 నాటి గోదావరి వరదల్లో భద్రాచలం అతలాకుతలం అయ్యింది.నాడు వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించా.గోదావరి వరదలకు అడ్డుకట్టగా కరకట్ట ఉండాలని నాడు ఎన్టీఆర్ సంకల్పిస్తే ఆ శ్రీరామ చంద్రుని ఆదేశాలతో కరకట్ట నిర్మించాం.ముందు చూపుతో నిర్మాణం చేసిన కరకట్ట భద్రాచల వాసులకు శ్రీ రామ రక్షగా నిలిచింది.తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఐదు విలీన గ్రామాల్లో కరకట్ట నిర్మాణం చేసి శాశ్వత పరిష్కారం చూపిస్తాము.
చేసిన అభివృద్ధి పనులు సామాజిక సేవ చరిత్రలో నిలిచిపోతాయి.మీ హయాంలోనే భద్రాచలంలో కరకట్ట..టూరిజం హోటల్, డిగ్రీ కాలేజ్ నిర్మాణం చేశారని స్థానికులు చెపుతుంటే ఎంతో గర్వంగా ఉంది.ముందు చూపుతో చేసిన పనులే సమాజానికి సత్పలితాలను ఇస్తాయి.ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ప్రజల కష్టాల్లోంచి బయటపడే మార్గాలను ప్రభుత్వాలు ఆలోచించాలి.తాను తీసుకొచ్చిన ఐటి విప్లవం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని యువత లక్షలు సంపాదిస్తున్నారు.ప్రభుత్వాలు ముందుచూపుతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి.