Telugu News

తెలంగాణలో కొన్ని స్థానాల్లో టీడీపీ పోటీ

లోకేష్​​కు నిర్ణయాత్మక బాధ్యతలు

0

తెలంగాణలో కొన్ని స్థానాల్లో టీడీపీ పోటీ

== లోకేష్​​కు నిర్ణయాత్మక బాధ్యతలు

== పోటీచేసే స్థానాలపై ఈరోజు చర్చ

== 20 స్థానాల్లో బరిలోకి దిగే చాన్స్?

(హైదరాబాద్‌‌‌‌-విజయం న్యూస్):

తెలంగాణ ఎన్నికలకు దూరమవుదామనుకున్న తెలుగుదేశం పార్టీ నిర్ణయానికి కార్యకర్తలు అడ్డుపడి ఆదోంళన చేయడంతో కొన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు పార్టీ నిర్ణయించింది.. బలంగా ఉన్న స్థానాల్లో మాత్రమే పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు నిర్ణయాత్మక బాధ్యతలను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అప్పగించారు. శనివారం జైళ్ళో తండ్రి తో ములాఖాత్ అయిన లోకేష్ తెలంగాణ లో జరుగుతున్న తాజా పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్​ ములాఖత్‌‌‌‌ అయ్యారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఎట్టకేలకు రాష్ట్రంలో ఎన్నికలకు సిద్ధపడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ బలంగా ఉన్న స్థానాల్లోనే పోటీ చేసేందుకు చంద్రబాబు గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ ఇచ్చినట్లు తెలిసింది. కనీసం 15 నుంచి 20 స్థానాల్లో టీడీపీ పోటీ చేయడం ద్వారా పార్టీకి మేలు జరుగుతుందని, అన్ని స్థానాల్లో పోటీ చేస్తే వ్యతిరేక ఓటు చీలి అధికార పార్టీకి లబ్ధి చేకూరే అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచా రం. అలాగే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్​​కు నిర్ణయాత్మక బాధ్యతలు అప్పగించారు. ఆయన నేతృత్వంలో టీడీపీ ఎన్నికల కమిటీ నిర్ణయం మేరకు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించనున్నారు.*

== నేడు తెలంగాణ టీడీపీ బేటి..?

*టీడీపీ నేతలు సోమవారం ఎన్టీఆర్‌‌‌‌ ట్రస్ట్‌‌‌‌ భవన్‌‌‌‌లో సమావేశమై పార్టీ పోటీ చేసే స్థానాలపై చర్చించనున్నారు. ఈ మేరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం ఒక కమిటీని అర్వింద్‌‌‌‌ కుమార్‌‌‌‌ గౌడ్‌‌‌‌, బక్కని నర్సింహులు, నన్నూరి నర్సిరెడ్డి, చిలివేరు కాశీనాత్​తో పాటు పలువురు సీనియర్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వారందరు ఈరోజు సమావేశమై అభ్యర్థుల లిస్ట్​ను సిద్ధం చేయనున్నారు.*

== చేరికలపై గురి..

ప్రధాన పార్టీలైన బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌, బీజేపీలో సీట్లు రాని అసంతృప్త నేతలకు టీడీపీ టికెట్‌‌‌‌ ఇచ్చే అవకాశాలు పరిశీలించనున్నారు. లోకేష్‌‌‌‌ ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్‌‌‌‌ రంగంలోకి దిగి అసంతృప్తులకు టీకెట్‌‌‌‌ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పార్టీ పోటీ చేసే అభ్యర్థుల్లో గంపగుత్తగా ఒకే సామాజిక వర్గానికి సీట్లు కేటాయించవద్దని పార్టీ అధినేత సూచించినట్లు తెలిసింది. గతంలో రూపొందించిన 30 మంది లిస్ట్‌‌‌‌లో 14 మంది పేర్లు ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. పార్టీ అధ్యక్షుడి కుటుంబానికి సంబంధించిన వాళ్లే ఎక్కువ మందికి సీట్లు ఇచ్చే పరిస్థితి ఉందనే విమర్శలు రాకుండా చూసుకోవాలని సూచించినట్లు తెలిసింది. దీంతో కాసాని కుటుంబంలో ఇద్దరికి మాత్రమే టికెట్‌‌‌‌ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.