Telugu News

టిడిపి కార్యాలయం పై దాడికి నిరసన సీఎం జగన్ దిష్టిబొమ్మ దగ్ధం

భారీ ప్రదర్శన చేసిన టీడీపీ నాయకులు

0

టిడిపి కార్యాలయం పై దాడికి నిరసన సీఎం జగన్ దిష్టిబొమ్మ దగ్ధం

— ఖమ్మం నగరంలో ర్యాలీ నిర్వహించిన టీడీపీ నేతలు

(ఖమ్మం- విజయంన్యూస్)

తెలుగుదేశం పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయం పై వైసీపీ గుండాల దాడిని నిరసిస్తూ ఖమ్మం పార్లమెంట్ కమిటీ అద్వ్రర్యంలో బైపాస్ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రిజగన్ దిష్టిబొమ్మను టీడీపీ కార్యకర్తలు దగ్ధం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన దుండగులను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేసారు సీఎం డౌన్ డౌన్ అరాచక పాలనను అంతమొందించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పక తప్పదన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అరాచక రౌడీ పాలన కొనసాగుతోందన్నారు. శాంతి భద్రతలు కాపాడటంలో పోలీస్ వ్యవస్థ విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రాయపూడి.జయాకర్,ప్రధాన కార్యదర్శి కేతినేని హరీష్ ,ఉపాధ్యక్షులు కొండబాలకరుణాకర్,తెలుగుయవత రాష్ట్ర కార్యదర్శి నున్నానవీన్ , కాంపాటి విజయ్ , పాలడుగు క్రిష్ణ ప్రసాద్ , నాగండ్ల లక్ష్మణ్ , గుత్తా. సీతయ్య, వల్లంకొండ.వెంకట్రామయ్య, సానబోయిన.శ్రీనివాస్, బోడేపూడి రవి , నాగండ్ల.మురళి, మేకల.సత్యవతి,మందపల్లి.రజిని, ఆకారపు.శ్రీనివాస్, మందపల్లి.కోటేశ్వరరావు, కందిబండ.నర్సింహారావు, తాళ్లూరి.శ్రీనివాస్, వడ్డెమ్. విజయ్,  చావా.రామారావు, యరణం.జేమ్స్,నీరుడు.రాంబాబు,పారిస్.వెంకన్న, బెజవాడ.రవి,చావా.కోటేశ్వరరావు, ఉన్నాం.శ్రీనివాస్ , గోపి.శంకర్ మంగమ్మ, ఆత్కూరు.నరీష్, పొదిల.భూపతి, చిరుమామిల్ల.రవి,తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చూడండి : ‌- టీవీ చూస్తూ పిల్లలు భోజనం చేస్తే ప్రమాదమే

అందుకు సంబంధించిన పోటోలు ఇవే