Telugu News

చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకుంటున్న టీడీపీ నేతలు

చిలకలూరిపేట నుంచి విజయవాడకు బయలుదేరిన కన్వాయ్

0

చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకుంటున్న టీడీపీ నేతలు

== పార్టీ శ్రేణులకు సర్ది చెప్పిన చంద్రబాబు

== చిలకలూరిపేట నుంచి విజయవాడకు బయలుదేరిన కన్వాయ్

(అమరావతి -విజయం న్యూస్)

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నయుడు అరెస్టు ఏపీ రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్కిల్ డెవలప్మెంట్ విషయంలో జరిగిన అవినీతి అక్రమాల్లో ఏవన్ గా ఉన్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ను సిఐడి అధికారులు నంద్యాలలో అరెస్టు చేయగా , అక్కడ నుంచి విజయవాడకు భారీ కన్వాయ్ లో చంద్రబాబునాయుడు తరలిస్తున్నారు.

ఇది కూడా చదవండి :- ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్

ఈ విషయం తెలుసుకున్న తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు నాయకులు చిలకలూరిపేట వద్ద నేషనల్ హైవేపై చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ని అడ్డుకున్నారు సుమారు 30 నిమిషాల పాటు కానువాయికి అడ్డంగా కూర్చొని పెద్దపెటున నినాదాలు చేయడంతో పాటు నడిరోడ్డుపై టైర్లను కాలవటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయన స్వయంగా కారు నుంచి బయటికి వచ్చి కార్యకర్తలకు నాయకులకు సర్ది చెప్పారు దీంతో కార్యకర్తలు రోడ్డులు ఖాళీ చేయి ఖాళీ చేసి కాన్వాయకు దారి ఇవ్వటంతో చంద్రబాబు నాయుడు కాన్వాయ్ తిరిగి ప్రారంభమైంది అయితే అక్కడి నుంచి మరో 10 కిలోమీటర్ల దూరం రాగానే మరొక తెలుగుదేశం పార్టీ బృందం నడిరోడ్డుపై కూర్చొని ఆందోళనకు దిగడంతో చంద్రబాబునాయుడు కాన్వాయ్ నడిరోడ్డుపై నిలిచిపోయింది ఈరోజు శనివారం కావడంతో సాయంత్రం లోపు సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది..

ఇది కూడా చదవండి:- వేషగాళ్లు వస్తున్నారు..? జరజాగ్రత్త: మంత్రి

పార్టీ శ్రేణులకు సర్ది చెప్పిన చంద్రబాబు

రోడ్డును ఖాళీ చేయాలని కోరిన చంద్రబాబు

దీంతో కాన్వాయ్ కు క్లియరెన్స్ ఇచ్చిన టీడీపీ శ్రేణులు

విజయవాడకు బయలుదేరిన చంద్రబాబు కాన్వాయ్

విజయవాడలో భారీ బందోబస్తు