ఖమ్మంలో నేడు విజయశంఖారావం
== హాజరుకానున్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు
== లక్ష మందితో సభను విజయవంతం చేయబోతున్నాము
== రాబోయే ఎన్నికల కు చంద్రబాబు ఖమ్మం నుంచే విజయ శంఖారావం పూరించబోతున్నారు
== విజయ శంఖారావం సభ ద్వారా చంద్రశేఖర,బాబు తెలుగుదేశం క్యాడర్ కు దిశానిర్దేశం చేయబోతున్నారు
== విలేకర్ల సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఖమ్మం నగరం పసుపుమయమైంది.. సర్థార్ పటేల్ స్టేడియం పచ్చతోరణమైంది.. ఖమ్మం జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్న సందర్భంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయగా, ఈ సభను సక్సెస్ చేసేందుకు టీడీపీ పార్టీ నాయకులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. సుమారు లక్షన్నర జన సమీకరణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ కౌటట్లు, హోర్డింగ్ లు, ప్లెక్సిలను ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతమైన కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెం సరిహద్దు వద్ద చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి:- ఖమ్మంలో ‘ప్రెస్ క్లబ్’ లొల్లి షూరు
మరీ ముఖ్యంగా వేలాధి మంది జనంను నాయకన్ గూడెం తీసుకెళ్లి అక్కడ నుంచి చంద్రబాబును తోడుకుని భారీ మోటర్ సైకిల్ ర్యాలీగా ఖమ్మం వరకు చేరుకోవాలని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే కూసుమంచి మండలంలోని కేశ్వాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు. కాగా అక్కడ టీడీపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఎక్కడ చూసిన ప్లెక్సిలు, బ్యానర్లు వెలవడంతో ఖమ్మం నియోజకవర్గంలో టీడీపీ పునర్వభవం వచ్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.
== లక్షన్నర మందితో బహిరంగ సభ : కూరపాటి వెంకటేశ్వర్లు
తెలంగాణ లో టిడిపి పునర్ వైభవానికి విజయశంఖారావం సభ కలిసి వస్తుందని టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఖమ్మం నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, కనీసం ఒకరు కూడా ఈ ప్రభుత్వంపై ఇష్టంగా లేరని అన్నారు. ఖమ్మంకేంద్రంగా సమరశంఖారావు పూరిస్తామని తెలిపారు. సీఎం కీసీఆర్ ఈ బహిరంగ సభకు హాజరవుతున్నారని తెలిపారు. రాబోయే రోజుల లో అన్ని సామాజిక వర్గాలు చంద్రబాబుతో కలసి నడవబోతున్నాయని, తెలంగాణ లో టిడిపి కి పునర్ వైభవం ఖాయమని అన్నారు. చంద్రబాబు సభకు జనం స్వచ్చందంగా తరలిస్తున్నారని తెలిపారు.
ఇది కూడా చదవండి: సిటి బస్టాండ్ గా ‘ఖమ్మం పాత బస్టాండ్’
సుమారు లక్ష నుంచి లక్షన్నర మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలివస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా టీడీపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రామగ్రామానా ముమ్మరంగా ప్రచారం చేశామని అన్నారు. లక్షలాధి కరపత్రాలతో ఇంటింటికి తెలుగుదేశం నినాదంతో ప్రచారం చేశామన్నారు. అలాగే సర్థార్ పటెల్ స్టేడియం మొత్తం పసుపుమయమైందని అన్నారు. జాతీయ రహధారులతో పాటు గ్రామీణ రహదారులు వారి గా పెద్దపెద్ద హోర్డింగ్, ప్లెక్సిలను ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రచారాన్ని చూసి ఇప్పటి వరకు నిస్తేజంగా ఉన్నా నాయకులు, కార్యకర్తలు కూడా మేము తెలుగుదేశం పార్టీలోకి వస్తామని చెబుతున్నారని తెలిపారు. ప్రజలందరు పార్టీలకు అతీతంగా రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులు, రాష్ట్ర పార్టీ నాయకులు హాజరైయ్యరు.