Telugu News

 ఉపాధ్యాయులే సమాజానికి మార్గదర్శకులు: ఎస్ఐ

చారి కృషి అభినందనీయం. ఎస్ ఐ రవి

0

 ఉపాధ్యాయులే సమాజానికి మార్గదర్శకులు: ఎస్ఐ

== చారి కృషి అభినందనీయం. ఎస్ ఐ రవి

ఏన్కూరు. మే 30 (విజయం న్యూస్)

ఉపాధ్యాయులే సమాజానికి మార్గదర్శకులని ఏన్కూరు ఎస్సై బాదావత్ రవి అన్నారు. మండలంలోని టిఎల్ పేట గ్రామానికి చెందిన 22 మంది విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్షల్లో సీట్లు సాధించారు. ఆ గ్రామానికి చెందిన ట్యూషన్ మాస్టర్ జుజ్జురి కృష్ణమాచారి వీరికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా టిఎల్ పేట గ్రామంలో ఏర్పాటైన అభినందన కార్యక్రమంలో ఎస్ఐ మాట్లాడుతూ గురువులను మించిన దైవం లేదని, గురువులు సమాజానికి మార్గదర్శకమని, సీట్లు సాధించిన విద్యార్థులందరూ భవిష్యత్తులో కూడా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ గ్రామంలో 30 ఏళ్లుగా గురుకుల ప్రవేశాలకు శిక్షణను ఇస్తూ ఎంతో మందిని తీర్చి దిద్దిన కృష్ణమాచారి కృషి అభినందనీయమన్నారు. అనంతరం కృష్ణమాచారి ని ఎస్ ఐ రవి, సర్పంచ్ బానోత్ వీరభద్రం లు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. సీట్లు సాధించిన విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోతు వీరభద్రం తోపాటు, మాజీ విద్యా కమిటీ చైర్మన్ రుద్రాక్షల నాగాచారి, ముదిరాజ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతనబోయిన సీతారాములు, రుద్రాక్షల నరసింహ చారి, రుద్రాక్షల సత్యనారాయణచారి,నాగరాజు,ఉపేందర్, వెంకీ రుద్రగిరి తదితరులు పాల్గొన్నారు.వకే గ్రామం నుంచి ఎక్కువమంది గురుకుల సీట్లు సాధించడం పట్ల శిక్షణ ఇచ్చిన కృష్ణమాచారి ని, విద్యార్థులను వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యేలు బానోత్ మదన్లాల్, డాక్టర్ బానోతు చంద్రావతి అభినందించారు

ఇది కూడా చదవండి: మంత్రిగారు దమ్ముంటే నాపై అవిశ్వాసం పెట్టు: కనకయ్య