అభివృద్ధిలో టీకన్నపల్లి ఆదర్శం
- పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు - నిత్యం ఇంటింటా చెత్త సేకరణ - అందుబాటులోకీ వైకుంఠదామం, డంపింగ్ యార్డ్ - పంచదానాన్ని పంచుతున్న పల్లె ప్రకృతి వనం
అభివృద్ధిలో టీకన్నపల్లి ఆదర్శం
– పల్లె ప్రగతితో మారిన గ్రామ
రూపురేఖలు
– నిత్యం ఇంటింటా చెత్త
సేకరణ
– అందుబాటులోకీ
వైకుంఠదామం, డంపింగ్
యార్డ్
– పంచదానాన్ని పంచుతున్న
పల్లె ప్రకృతి వనం
(హాజీపూర్ – విజయం న్యూస్):-
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని టికన్నపల్లి గ్రామంలో గ్రామ రూపు రేఖలు మారిపోయాయి. గ్రామంలోని రోడ్డుకు ఇరువైపులా హరితహరంలో భాగంగా నాటిన మొక్కలతో పచ్చదనం సంతరించుకున్నది.పల్లె ప్రకృతి వనం స్థానికులకు ఆహ్లాదాన్ని పంచుతుంది.మంచిర్యాల జిల్లా గా ఏర్పాటు అయిన తరువాత కొత్త ఏర్పడిన టికన్నపల్లి గ్రామం అభివృద్ధి పథంలో దూసుకెళ్లితుంది.గ్రామంలో 1524మంది జనాభా ఉండగా ఓటరులు 1185 మంది ఉన్నారు. సర్పంచ్ రామటెంకి మల్లీశ్వరి-దుర్గయ్య,పంచాయతి కార్యదర్శి హారిక,పంచాయతి పాలకవర్గం ఆద్వర్యంలో అభివృద్ది కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పల్లె ప్రగతి ద్వారా ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను పంచాయతి పాలక వర్గం అభివృద్ది కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నారు. టికన్నపల్లి గ్రామంలో వైకుంఠధామం, పల్లె ప్రకృతీ వనం, డంపింగ్ యార్డు, విధి లైట్స్, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి అభివృద్ధి పనులతో గ్రామం అభివృద్ది పనులతో గ్రామం ప్రగతి పథంలో దూసుకెళ్తుంది. అదేవిధంగా పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.పారిశుధ్య సిబ్బంది ప్రతీరోజూ గ్రామంలోని చెత్త చెదారాన్ని తొలగించి పల్లె ప్రగతి నిధులతో కొనుగోలు చేసిన పంచాయతి ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డు కు తరలిస్తున్నారు.అక్కడ వ్యర్థాలతో ఎరువును తయారు చేసి హరితహరం, పల్లే ప్రకృతి వనంలోని మొక్కలకు వినియోగిస్తున్నారు. మిషన్ భగీరథ ట్యాంక్ నుంచే, కాకుండా ప్రత్యేకంగా రెండు బోర్లు ఏర్పాటు చేసి స్థానికులకు నీటిని ప్రతీ రోజూ తాగునీటినీ సరఫరా చేస్తున్నారు. హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఊరాంతా పచ్చదనంతో కళకళలాడుతుంది.
also read :- ఘనంగా గాయత్రి రవి పుట్టిన రోజు వేడుకలు
పక్కాగా పారిశుధ్య నిర్వహణ
గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి పంచాయతి సిబ్బందితో విధులు శుభ్రం చేయిస్తున్నారు. చెత్త సేకరణ కు కొనుగోలు చేసిన ట్రాక్టర్ నిత్యం గ్రామంలో ఇంటింటికీ తిరిగి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి ఎరువులు తయారీ చేస్తున్నారు. ఒకప్పుడు విధుల్లో చెత్త కుప్పలు దర్శనం ఇచ్చేది ప్రస్తుతం చెత్త రహిత విధులుగా మారాయి.
గ్రామంలో ఎటు చూసినా పచ్చదానమే
గ్రామంలోనీ ప్రతి విధి ఖాళీ స్థలాలో, రోడ్ల వెంట మొక్కలు నాటారు. హరితహారం మొదటి విడుతలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి నేడు పచ్చదానాన్ని పెంచుతున్నాయి. పల్లె ప్రకృతి వనం లో వేల మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. నర్సరీలో రాగి, ఉసరి, చింత,గోరింటాకు, మందార, తులసి, దానిమ్మ, కానుగు, జామ, వేప, మునగ, టేకు, నేరేడు వంటి విత్తనాలు పెట్టి మొలకెత్తిన మొక్కలకు నిత్యం నీరు పోసి పోషిస్తున్నారు.
– ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుతా..
రామటెంకి మల్లేశ్వేరీ సర్పంచ్
ఉమ్మడి గ్రామ పంచాయతీ హాజీపూర్ ఉన్నప్పుడు మా గ్రామం అభివృద్ధికీ నోచుకోలేదు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో , మాకు ఎస్ సి మహిళ రిజర్వేషన్ రావడంతో నా భర్త దుర్గయ్య ప్రోత్సాహం తో ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందాను. గెలిచినప్పుడునుండీ సర్కార్ జిపిలకు ప్రతీ నెల నిధులు మంజూరు చేయడంతో మెజార్టీ సమస్యలు తీరుతున్నాయి.
గ్రామం పరిశుభ్రంగా కనిపిస్తోంది. పల్లె ప్రకృతి వనం, ఇతర అభివృద్ధి పనులు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. గ్రామంలో ప్రభుత్వ పథకాలను అర్హులకు అందేలా కృషి చేస్తా.
పార్టీలకు అతీతంగా గ్రామాన్ని ఆదర్శంగా పరుస్తాం. టికన్నపల్లి గ్రామాన్ని జిల్లాలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం.
also read :- నాడు అక్రమము నేడు సక్రమం
అందరి సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి
పంచాయతి కార్యదర్శి … హారిక
గ్రామ ప్రజల సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నాం. పల్లె ప్రగతిలో అందరినీ భాగస్వామ్యం చేస్తూ ముందుకు సాగుతున్నాం. తడి పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించి సేంద్రియ ఎరువును తయారు చేసి హారితహరం మొక్కలకు వేస్తున్నాం. వైకుంఠదామం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, నర్సరీ అందుబాటులోకి వచ్చాయి. ఉన్నతాధికారుల సలహా సూచనలు తీసుకోని మరింత అభివృద్దికీ పాటు పడుతున్నాం
ఎమ్మెల్యే దివాకర్ సహకారంతోనే…
మాదవరపు జితేందర్ రావు
ఉప సర్పంచ్
టికన్నపల్లి గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే నడీపెల్లి దివాకర్ రావు కృషితోనే సాధ్యమైంది. గ్రామంలో వైకుంఠదామం, పల్లే ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, ట్రాక్టర్, ట్యాంకర్, సిసిరోడ్ల నిర్మాణాలు,డ్రైనేజ్ వంటి అభివృద్ధి పనులను చెప్పట్టడం జరిగింది. ఎమ్మెల్యే సహకారంతో ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాన్ని మండలంలో నే ఆదర్శంగా తీర్చిదిద్దుతం.