వినాయక పూజలకు పొంగులేటి టీమ్ అర్థిక చేయూత
== నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించిన పొంగులేటి టీమ్
== వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు… విరాళాలు అందజేత
(కూసుమంచి-విజయంన్యూస్):
తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి కూసుమంచి మండలంలో మంగళవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మండల ప్రజలంతా సుఖసంతోషాలతో వర్థిల్లేలా చూడాలని వినాయకున్ని వేడుకున్నారు. మండపానికి రూ. 5వేల చొప్పున ప్రతీ మండపానికి విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు దయాకర్ రెడ్డిని ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మట్టె గురవయ్య, సీనియర్ నాయకులు మహ్మద్ హాఫీజుద్దీన్, నాయకులు పి.అంజయ్య, బజ్జూరి వెంకట్ రెడ్డి, బొల్లం సుధాకర్ రెడ్డి, బొల్లికొండ శ్రీనివాస్, గుండా దామోదర్ రెడ్డి, సర్పంచ్ సూర్యనారాయణరెడ్డి, చిలకబత్తిని రామారావు, బెల్లంకొండ కిరణ్, వడ్తియా సైదా నాయక్, సర్పంచ్ బానోతు శ్రీనివాస్ నాయక్, అంజిరెడ్డి, బారీ వీరభద్రం, అర్వపల్లి జనార్థన్, భూపాల్ రెడ్డి, కందుల వెంకన్న, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: రోజంతా పంచుడే..పంచుడు..వామ్మో ఎన్ని పైసలో..?
== తిరుమలాయపాలెంలో పొంగులేటి ప్రసాద రెడ్డి పర్యటన
తిరుమలాయపాలెం : తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద రెడ్డి తిరుమలాయపాలెం మండలంలో మంగళవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. మండల ప్రజలంతా సుఖసంతోషాలతో వర్థిల్లేలా చూడాలని వినాయకున్ని వేడుకున్నారు. మండపానికి రూ. 5వేల చొప్పున ప్రతీ మండపానికి విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు పొంగులేటి ప్రసాద రెడ్డిని ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రామసహాయం నరేష్ రెడ్డి, పాలేరు నియోజకవర్గ నాయకులు చావా శివరామకృష్ణ, జెడ్పీటీసీ బెల్లం శ్రీను , మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
== ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించిన స్వర్ణకుమారి
ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు మద్దినేని బేబి స్వర్ణకుమారి ముమ్మరంగా పర్యటించారు. మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆమె వినాయక విగ్రహాల వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఒక్కోక్క విగ్రహానికి రూ.5వేల చొప్పున కమిటీ బాధ్యులకు అందజేశారు. కమిటీ బాధ్యులు స్వర్ణకుమారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కళ్లెం వెంకట్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు హాజరైయ్యారు.
ఇది కూడా చదవండి: ఖమ్మంలో నేడు వినాయక నిమజ్జనం