Telugu News

తేజ ట్రేడర్స్ ను ప్రారంభించిన మాజీ ఎంపీ పొంగులేటి

- సత్తుపల్లి, కల్లూరు, కారేపల్లి మండలాల్లో పర్యటన

0

తేజ ట్రేడర్స్ ను ప్రారంభించిన మాజీ ఎంపీ పొంగులేటి
– సత్తుపల్లి, కల్లూరు, కారేపల్లి మండలాల్లో పర్యటన
– పలు కుటుంబాలకు పరామర్శ, ఆర్థికసాయం

(సత్తుపల్లి,ఖమ్మం- విజయంన్యూస్)
సత్తుపల్లి పట్టణంలోని ప్రధాన రహదారిలో నూతనంగా ఏర్పాటు చేసిన తేజ ట్రేడర్స్ అండ్ సర్వీసెస్ ను తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మలిరెడ్డి మురళీరెడ్డిని అభినందించి, వినియోగదారులకు మెరుగైన సేవలను అందించాలని సూచించారు. అనంతరం కల్లూరు మండలం అంబేద్కర్ నగర్ లో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు కాలిపోయి ఇబ్బందులు పడుతున్న ఉ బ్బన నాగరాజు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. అలాగే ఇటీవల మృతిచెందిన లక్కీనేని అప్పారావు కుటుంబసభ్యులు లక్కీనేని రఘుతో పాటు పలువురిని పరామర్శించి ఓదార్చారు. పుల్లయ్య బంజర రోడ్డులో డయాలసిస్ తో బాధపడుతున్న రెహమాన్ అనే వ్యక్తిని పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు.

also read :-కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి

అదేవిధంగా రెండు రోజుల క్రితం పుల్లయ్య బంజర గ్రామానికి చెందిన కిష్టంశెట్టి నాగయ్య మృతిచెందగా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం గేట్ కారేపల్లిలో ఇటీవల మృతిచెందిన మండెపుడి వెంకట అప్పారావు కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పొంగులేటి వెంట డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయ్ బాబు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, డాక్టర్ మట్టా దయానంద్, పిడమర్తి రవి, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, మందపాటి ముత్తారెడ్డి, మౌలాలి, సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ తోట గణేష్-సుజలరాణి, కమల్ పాషా, తుమ్మూరు కృష్ణారెడ్డి, దారా యుగంధర్, శ్రీనివాసరెడ్డి, కీసర వెంకటేశ్వరరెడ్డి, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, నగర కార్పొరేటర్ దొడ్డా నగేశ్, సర్పంచ్ మోహన్, యాసా వెంకటేశ్వరరావు, కాటేపల్లి కిరణ్, ఏసు రెడ్డి, ఉస్మాన్, మట్టూరి జనార్థన్, దామళ్ల సురేశ్, తురావలి, శ్రీను, సత్యంబాబు, మద్దినేని లోకేష్, రామకృష్ణరెడ్డి, యాసా శ్రీకాంత్, కనగంటి రావు, మైబు, నాగరాజు, రాము, పుల్లయ్య, లాల్ సింగ్, నరసింహారావు, ప్రహ్లాద్, మాడిశెట్టి శ్రీనివాసరావు, బుర్రి వీరయ్య, వైయస్, మేకల కృష్ణ తదితరులు ఉన్నారు.