గాంధేయ మార్గమే మా లక్ష్యం : బత్తుల సోమయ్య
== శాంతియుత పోరాటం ద్వారానే సాధించు కుంటాం
== తొలి,మలి దశ ఉద్యమకారుల కు సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేయాలి
== ఉద్యమకారుల ఫోరమ్ పాలేరు నియోజకవర్గ స్థాయి సమావేశం లో రాష్ట్ర ఛైర్మెన్ డాక్టర్ చీమ శ్రీనివాసరావు,రాష్ట్ర కన్వీనర్ బత్తుల సోమయ్య
(నేలకొండపల్లి,కూసుమంచి-విజయంన్యూస్)
1969 తొలి,మలి దశ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పోరాడి, లాఠీ దెబ్బలు తిన్న ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి సంక్షేమ బోర్డ్ ను ఏర్పాటు చేయాలని ఉద్యమకారుల ఫోరమ్ పాలేరు నియోజకవర్గ స్థాయి రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ రావు, రాష్ట్ర కన్వీనర్ బత్తుల సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేలకొండపల్లి మండల కేంద్రలోని సీతారామ ఫంక్షన్ హల్ లో ఉద్యమకారుల ఫోరమ్ ఆధ్వర్యంలో ఆదివారం పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన తొలి,మలి దశ ఉద్యమకారుల తో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉద్యమాకారులు పెద్ద సంఖ్యలో హాజరైయ్యారు. కాగా ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన చీమ శ్రీనివాస్ రావు, బత్తుల సోమయ్యలు మాట్లాడుతూ తొలి,మలి దశ ఉద్యమాలు ఇక్కడే ప్రారంభమయ్యాయి.సంక్షేమ బోర్డ్ ఏర్పాటు మీటింగ్ ఇక్కడే ప్రారంభం కావడం శుభ పరిణామం అన్నారు.ఉద్యమకారులు ఉద్యమంలో ఎంతో మంది తమ ఉపాధి లు వదులుకొని పోరాటం లో సాగారు.
ఇది కూడా చదవండి : ‘ఆ నలుగురు’ చుట్టే రాజకీయం.. ఖమ్మం జిల్లాలో పొలిటికల్ హిట్
అలాంటి వారికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి.జార్ఖండ్ లో ఉద్యమకారులకు ఆ రాష్ట్రం ఎలాగైతే సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేసిందో,అలాగే తెలంగాణ ఉద్యమకారులకు రూ.5 వేల కోట్లతో బోర్డ్ ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.ప్రతి ప్రభుత్వ సంక్షేమ ఫలాల్లో ఉద్ద్యమకారులకు 20 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు.ఉద్యమ కారులను చట్టసభల్లోకి అనుమతించాలని సూచించారు. సెప్టెంబర్ 17 న 2019 లో ఉద్యమకారుల ఫోరమ్ ను ఏర్పాటు చేసుకున్నామని, ఉద్యమంలో కీలకపాత్ర వహించిన వారికి గుర్తింపు లేకపోవడం,ఉద్యమ విద్రోహులకు పెద్ద పీఠ వేయడం బాధాకరం అన్నారు.పాలేరు నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు అన్నారు.ఎన్నో ఆశలతో ఓట్లేసి గెలిపించుకున్న నాయకులు కండువాలు మార్చి ప్రజలను ఏమరుస్తున్నారని తెలిపారు.తెలంగాణ ద్రోహులు పీఠంపై కూర్చొని వెక్కిరిస్తుంటే,పాలనలో భాగస్వామ్యం లేకున్నా…తెలంగాణ ఫలాల్లో కూడా భాగస్వామ్యం లేకుంటే ఎలా అన్నారు.కాళోజీ చెప్పినట్లు ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ,పాతరేయాల్సిన సందర్భాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ తో పాలేరు నియోజకవర్గము లో పెండింగ్ లో ఉన్న 13 చెక్ డ్యాం లకు,బోధకాలు వ్యాధిగ్రస్తుల కు,ప్రాజెక్ట్ ల నిర్మాణానికి కృషి చేసి సాధించుకున్నట్లు తెలిపారు.ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఎమ్మెల్యేలు, మంత్రులే కావాల్సిన అవసరం లేదు.సామాన్య వ్యక్తి అయ్యి ఉండి, దృఢ సంకల్పంతో ఏదైనా సాధించవచ్చని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటోళ్ల సురేందర్ రెడ్డి,కో కన్వీనర్ పాలకుర్తి క్రిష్ణ,వైస్ చైర్మన్ వీరస్వామి, లాయర్ తెలురి వెంకటేశ్వరరావు,కూతురు కృష్ణమూర్తి,భాస్కర్ రావు,సొందు,పగిడి కత్తుల వీరస్వామి,రామదాసు,మాదాసు శ్రీనివాసరావు, తోట వెంకటనారాయణ, సంక రాంబాబు,బెల్లంకొండ నాగేశ్వరరావు,కోయ వెంకటనారాయణ, రామాంజనేయులు,ఏర్పుల గోపయ్య,చావా రమేష్,పోరంకి నర్స రాజు,అప్జల్ తదితరులు పాల్గొన్నారు.